AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC CGL 2023: ఎస్సెస్సీ సీజీఎల్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ అర్హతతో 7,500ల ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2023కు సంబంధించి 7,500ల ఉద్యోగాల భర్తీకి నియామక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు..

SSC CGL 2023: ఎస్సెస్సీ సీజీఎల్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. డిగ్రీ అర్హతతో 7,500ల ఉద్యోగాలు
SSC CGL 2023
Srilakshmi C
|

Updated on: Apr 04, 2023 | 1:48 PM

Share

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2023కు సంబంధించి 7,500ల ఉద్యోగాల భర్తీకి నియామక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ/ ఎంబీఏ (ఫైనాన్స్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మే 3, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/మహిళలు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. రాతపరీక్ష (టైర్‌-1, టైర్‌-2), డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,51,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
  • అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఐబీ)
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎవోఆర్‌)
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎంవోఈఏ)
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎఫ్‌హెచ్‌క్యూ)
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఈ అండ్‌ ఐటీ)
  • అసిస్టెంట్
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్
  • ఇన్‌స్పెక్టర్(సీజీఎస్టీ అండ్‌ సెంట్రల్ ఎక్సైజ్)
  • ఇన్‌స్పెక్టర్(ప్రివెంటివ్ ఆఫీసర్)
  • ఇన్‌స్పెక్టర్(ఎగ్జామినర్)
  • అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
  • సబ్ ఇన్‌స్పెక్టర్
  • ఇన్‌స్పెక్టర్(పోస్ట్ డిపార్ట్‌మెంట్)
  • అసిస్టెంట్/ సూపరింటెండెంట్
  • అసిస్టెంట్
  • అసిస్టెంట్(ఎన్‌సీఎల్‌ఏటీ)
  • రిసెర్చ్ అసిస్టెంట్
  • డివిజనల్ అకౌంటెంట్
  • సబ్ ఇన్‌స్పెక్టర్
  • జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
  • ఆడిటర్(సీ అండ్‌ ఏజీ)
  • ఆడిటర్
  • ఆడిటర్ (సీజీడీఏ)
  • అకౌంటెంట్
  • అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్‌
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌
  • సబ్-ఇన్‌స్పెక్టర్
  • పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి