TG Staff Nurse Exam Date: తెలంగాణ నర్సింగ్‌ ఆఫీసర్ల రాత పరీక్ష తేదీలో మార్పు.. కొత్త తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో నర్సింగ్‌ ఆఫీసర్ల (స్టాఫ్‌నర్సుల) ఎంపిక పరీక్షలో మార్పు చోటు చేసుకుంది. తాజాగా కొత్త తేదీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. నవంబరు 23వ తేదీన స్టాఫ్‌నర్సు పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తనప్రకటనలో పేర్కొంది..

TG Staff Nurse Exam Date: తెలంగాణ నర్సింగ్‌ ఆఫీసర్ల రాత పరీక్ష తేదీలో మార్పు.. కొత్త తేదీ ఇదే
TG Staff Nurse Exam Date
Follow us

|

Updated on: Oct 04, 2024 | 3:35 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో నర్సింగ్‌ ఆఫీసర్ల (స్టాఫ్‌నర్సుల) ఎంపిక పరీక్షలో మార్పు చోటు చేసుకుంది. తాజాగా కొత్త తేదీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. నవంబరు 23వ తేదీన స్టాఫ్‌నర్సు పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తనప్రకటనలో పేర్కొంది. మొదట కంప్యూటర్‌ ఆధారిత ఎంపిక పరీక్షను నవంబరు 17న నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తేదీని నవంబర్‌ 23కు మార్చినట్లు తెలిపింది. 2050 నర్సింగ్‌ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయడానికి సెస్టెంబర్‌ నెలలో ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఆర్‌ఐఎంసీ దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీపీఎస్సీ.. చివరి తేదీ ఇదే

దేహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కళాశాల (ఆర్‌ఐఎంసీ)లో 8వ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పెంపొందిస్తూ ఏపీపీఎస్సీ ప్రకటన వెలువరించింది. ఈ మేరకు అక్టోబరు 10 వరకు దరఖాస్తు తేదీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ గడువు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె ప్రదీప్‌కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు విజయవాడలోని ప్రధాన కార్యాలయానికి పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలని సూచించారు.

స్టాఫ్‌ సెలక్షన కమిషన్‌ సీజీఎల్‌ పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల.. అక్టోబర్‌ 6 అభ్యంతరాల స్వీకరణ

ఎస్సెస్సీ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామినేషన్‌-2024 టైర్‌-1 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్‌ కీ డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. కాగా సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ పద్ధతిలో టైర్‌ 1 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు రిజిస్టర్డ్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి సమాధానాల కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల రెస్పాన్స్‌ షీట్‌ను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కీపై అభ్యంతరాలు తెలియజేసేవారు రూ.100 రుసుము చెల్లించి అక్టోబర్‌ 6వ తేదీలోగా తెలియజేయవచ్చని పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని 17,727 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.