MBBS Convener Quota: తెలంగాణ MBBS కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ఆప్షన్లు ప్రారంభం.. అక్టోబరు 6 వరకు ఛాన్స్‌

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్ల కోసం రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఈ రౌండ్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రెండో రౌండ్‌లో వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ ప్రకటన జారీ చేసింది. అక్టోబరు 4 మధ్యాహ్నం నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రకటనలో తెలిపింది. ఇక కన్వీనర్‌ కోటా కింద..

MBBS Convener Quota: తెలంగాణ MBBS కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ఆప్షన్లు ప్రారంభం.. అక్టోబరు 6 వరకు ఛాన్స్‌
MBBS Convener Quota
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 04, 2024 | 4:09 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 4: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్ల కోసం రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఈ రౌండ్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రెండో రౌండ్‌లో వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ ప్రకటన జారీ చేసింది. అక్టోబరు 4 మధ్యాహ్నం నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రకటనలో తెలిపింది. ఇక కన్వీనర్‌ కోటా కింద మొదటి రౌండ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 4వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోపు కేటాయించిన మెడికల్‌ కాలేజీలో చేరాల్సి ఉంటుందని యూవర్సిటీ పేర్కొంది. మరోవైపు మేనేజ్‌మెంట్‌ కోటా కింద మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్‌ సీట్లను దక్కించుకున్న విద్యార్థుల వివరాలను కూడా కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ గురువారం ప్రకటించింది. కాలేజీల వారీగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా ఆర్మీ ప్రాధాన్య క్రమం వెల్లడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆర్మీ కేటగిరీ కన్వీనర్‌ కోటా సీట్ల ప్రాధాన్య క్రమాన్ని సైనిక్‌ వెల్ఫేర్‌ బోర్డు ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న వారిలో 447 మంది అర్హత సాధించారు. 31 మందికి సరైన పత్రాలు లేవని వెల్లడించింది. మొత్తంగా 478 మంది అభ్యర్థుల ప్రాధాన్య క్రమాన్ని విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీకి అందించింది. ఈ మేరకు హెల్త్‌ వర్సిటీ తాజా ప్రకటన విడుదల చేసింది.

ఎస్‌బీఐలో 1,511 స్పెషలిస్ట్ కేడర్‌ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెంపు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బ్యాంకుల్లో 1511 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పెరిగింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు అక్టోబర్‌ 4వ తేదీతో తుది గడువు ముగియనుంది. తాజా ప్రకటనతో ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అక్టోబర్‌ 14వ తేదీ వరకు అవకాశం ఇస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.