Viral Video: ‘ఛీయాక్.. చపాతీపై ఆవు పేడ వేసుకుని లొట్టలేసుకుంటూ తిన్న మొనగాడు’ వీడియో
ఎన్నడూ లేనిది ఈ మధ్య కాలంలో గోవులపై ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది కొందరికి. గోవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇది కొంత వరకు మంచిదేగానీ.. గోమూత్రం, గో మలంతో అరోగ్య సమస్యలు పోతాయనే వెర్రి కూడా జనాల్లో తెగ పాపులర్ అవుతుంది. ఇందుకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ.. ఎవరికి వారు ఇలా ప్రచారం చేసుకోసాగారు. అయితే ఓ వ్యక్తి ఆరోగ్యం కోసం చేశాడో.. సోషల్ మీడియాలో..
ఎన్నడూ లేనిది ఈ మధ్య కాలంలో గోవులపై ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది కొందరికి. గోవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇది కొంత వరకు మంచిదేగానీ.. గోమూత్రం, గో మలంతో అరోగ్య సమస్యలు పోతాయనే వెర్రి కూడా జనాల్లో తెగ పాపులర్ అవుతుంది. ఇందుకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ.. ఎవరికి వారు ఇలా ప్రచారం చేసుకోసాగారు. అయితే ఓ వ్యక్తి ఆరోగ్యం కోసం చేశాడో.. సోషల్ మీడియాలో వైరల్ అవుదామనుకున్నాడో తెలియదుగానీ.. ఓ నికృష్టానికి తెగించాడు. చేతిలో చపాతీ పట్టుకుని ఆవు పేడ ముందు కూర్చున్నాడు. అనంతరం పేడను చపాతీ మీద సాస్ మాదిరి పూసి, రోల్ చేసి నోట్లో పెట్టుకుని తినసాగాడు. పైగా అమోఘంగా ఉందంటూ తల ఊపుకుంటూ మరికాస్తా నోట్లో వేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ‘బాబోయ్.. వీడిని ఎవరైనా పిచ్చాసుపత్రికి తీసుకెళ్లండ్రోయ్..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 2.3 మిలియన్లకు పైగా వీక్షణలు, కామెంట్లు రావడంతో వైరల్‌గా మారింది.