Watch Video: ఫుట్‌బోర్డు ప్రయాణం చేయొద్దన్నందుకు.. ఆర్టీసీ బస్సు కండక్టర్‌ను కత్తితో పొడిచిన ప్రయాణికుడు! వీడియో

బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తూ నిత్యం ఎందరో ప్రమాదాల బారీన పడుతుంటారు. మన దేశంలో ఏదో ఒక చోట నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు ఫుట్ బోర్డు మీద నిలబడి ఉండగా.. ఆ బస్సు కండక్టర్‌ బస్సులోపలికి రమ్మని చెప్పాడు. దీంతో చిర్రెత్తిన ప్రయాణికుడు బస్సులోపలికి వచ్చి కండక్టర్‌ను కత్తితోపొడిచాడు. ఈ షాకింగ్‌ ఘటన..

Watch Video: ఫుట్‌బోర్డు ప్రయాణం చేయొద్దన్నందుకు.. ఆర్టీసీ బస్సు కండక్టర్‌ను కత్తితో పొడిచిన ప్రయాణికుడు! వీడియో
Man Stabs Bus Conductor
Follow us

|

Updated on: Oct 02, 2024 | 6:16 PM

బెంగళూరు, అక్టోబర్‌ 2: బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తూ నిత్యం ఎందరో ప్రమాదాల బారీన పడుతుంటారు. మన దేశంలో ఏదో ఒక చోట నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు ఫుట్ బోర్డు మీద నిలబడి ఉండగా.. ఆ బస్సు కండక్టర్‌ బస్సులోపలికి రమ్మని చెప్పాడు. దీంతో చిర్రెత్తిన ప్రయాణికుడు బస్సులోపలికి వచ్చి కండక్టర్‌ను కత్తితోపొడిచాడు. ఈ షాకింగ్‌ ఘటన బెంగళూరులో బుధవారం (అక్టోబర్ 2) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకెళ్తే..

బెంళూరు నగరంలోని ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. ఓ హర్ష్ సిన్హా (28) అనే యువకుడు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సు ఎక్కాడు. అతడు బస్సు లోపలికి వెళ్లకుండా ఫుట్‌ బోర్డు మీడ నిలబడటంతో కండక్టర్‌ యోగేష్ (45) గమనించారు. ఆటోమేటిక్ డోర్‌లకు దూరంగా నిలబడమని అతడికి చెప్పాడు. పైగా ప్రయాణికులకు బస్సు ఎక్కేందుకు, దిగేందుకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని తెలిపాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చిర్రెత్తి పోయిన హర్ష్ సిన్హా తన బ్యాగ్‌లోంచి కత్తి తీసి బస్సు కండక్టర్‌ను పొడిచాడు. దిగ్భ్రాంతికరమైన దాడి వల్ల బస్సులోని ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతోప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. బస్సు డ్రైవర్ సిద్దలింగస్వామి డోర్ లాక్ చేసి బయటకు దూకగా హర్ష లోపల ఇరుక్కుపోయాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. డ్రైవర్‌ బస్సు డోర్లు లాక్‌ చేయడంతో అక్కడి నుంచి తప్పించుకునేందుకు అద్దాల తలుపులను తన్నడం, పగలగొట్టేందుక ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని హర్ష్‌ సిన్హాను అరెస్ట్‌ చేసి, స్టేషన్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

కాగా జార్ఖండ్‌కు చెందిన హర్ష్ సిన్హా BPO సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. అతడిని ఇటీవల ఆ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. సుమారు మూడు వారాలుగా అతడు ఉద్యోగం లేకుండా ఎండటంతొ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం బెంగళూరు మెట్రో బస్సు ఎక్కిన అతడు క్షణికావేశంలో కండక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఐటీపీఎల్ బస్టాప్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన బస్సు కండక్టర్‌ను ఆసుపత్రిలో చేర్చారని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. హత్యాయత్నం కేసులో నిందితుడైన హర్ష్‌ సిన్హాను అరెస్టు చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.