Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jharkhand: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. రైల్వే ట్రాక్‌‌ను పేల్చేసిన దుండగులు!

జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సాహిబ్‌గంజ్‌లో పేలుడు పదార్థాలు అమర్చి రైల్వే ట్రాక్‌ను దుండగులు పేల్చివేశారు. ఈ ఘటన లాల్‌మటియా నుంచి ఫరక్కా వెళ్లే ఎంజీఆర్‌ రైల్వే లైన్‌లో చోటుచేసుకుంది.

Jharkhand: తృటిలో తప్పిన పెను ప్రమాదం.. రైల్వే ట్రాక్‌‌ను పేల్చేసిన దుండగులు!
Train Track Blast
Balaraju Goud
|

Updated on: Oct 02, 2024 | 6:29 PM

Share

జార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సాహిబ్‌గంజ్‌లో పేలుడు పదార్థాలు అమర్చి రైల్వే ట్రాక్‌ను దుండగులు పేల్చివేశారు. ఈ ఘటన లాల్‌మటియా నుంచి ఫరక్కా వెళ్లే ఎంజీఆర్‌ రైల్వే లైన్‌లో చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత ఈ మార్గంలో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని భారత రైల్వే అధికారులు అప్రకటించారు. అయినప్పటికీ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు.

జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లా బార్హెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగ ఘుట్టు గ్రామ సమీపంలో, లాల్మాటియా నుండి ఫరక్కా వరకు MGR రైల్వే లైన్‌కు సమీపంలో, దుండగులు పేలుడు పదార్థాలు అమర్చి పేల్చారు. ఇందులో 470 సెంటీమీటర్ల ట్రాక్‌ దెబ్బతింది. పేలుడు చాలా శక్తివంతమైనదని, రైల్వే ట్రాక్‌లోని కొంత భాగం 39 మీటర్ల దూరంలో పడిపోయింది.

స్థానికుల సమాచారం ప్రకారం, పేలుడు తర్వాత ట్రాక్‌లో 770 సెంటీమీటర్ల గ్యాప్ కనిపించింది. అక్కడ మూడు అడుగుల లోతున గొయ్యి ఉంది. స్తంభం నంబర్ 40/1 సమీపంలో పేలుడు సంభవించింది. పిల్లర్ నంబర్ 39/15 వద్ద ట్రాక్ ముక్కను రైల్వే సిబ్బంది గుర్తించింది.ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఈ పేలుడు ఎందుకు జరిగిందో తెలియరాలేదు. ప్రమాదం తర్వాత, జార్ఖండ్ పోలీసు, RPF, రైల్వే సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. అనేక కోణాల్లో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం వెనుక నక్సలైట్ల హస్తం ఉందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేశారా అనేది ఇప్పటి వరకు వెల్లడి కాలేదు.

రైల్వేశాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన తర్వాత, బొగ్గు లోడుతో కూడిన రైలు పోల్ నంబర్ 42/2 దగ్గర ఆగి ఉంది. ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే నైట్ గార్డ్ జితేంద్ర కుమార్ షా మాట్లాడుతూ.. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తన డ్యూటీ ఇదే లైన్‌లో ఉంటుందని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో ఆయన విధుల్లో ఉన్నారు. పలుమార్లు తనిఖీలు చేసినా రాత్రి 10 గంటల వరకు లైన్‌లో ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదు. రాత్రి 12 గంటల ప్రాంతంలో పేలుడు శబ్దం రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..