TG DSC 2024 Results: ‘డీఎస్సీ పోస్టులకు 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్‌.. అక్టోబర్ 9న నియామకపత్రాలు’ సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్‌ చేతుల మీదగా సోమవారం (సెప్టెంబర్‌ 30) విడుదలైన సంగతి తెలిసిందే. డీఎస్సీ-2024 ఫలితాల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు నా అభినందనలు.1:3 ప్రాతిపదికన ఫలితాలు ఫలితాలు విడుదల చేసాం. దసరా లోపు ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తాం. అంతా సవ్యంగా జరిగితే అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తాం. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక సారి డీఎస్సీ..

TG DSC 2024 Results: 'డీఎస్సీ పోస్టులకు 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్‌.. అక్టోబర్ 9న నియామకపత్రాలు' సీఎం రేవంత్‌ రెడ్డి
CM Revanth Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 30, 2024 | 2:33 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్‌ చేతుల మీదగా సోమవారం (సెప్టెంబర్‌ 30) విడుదలైన సంగతి తెలిసిందే. డీఎస్సీ-2024 ఫలితాల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు నా అభినందనలు.1:3 ప్రాతిపదికన ఫలితాలు ఫలితాలు విడుదల చేసాం. దసరా లోపు ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తాం. అంతా సవ్యంగా జరిగితే అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తాం. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక సారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. పదేళ్లలో వాళ్లు చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు కేవలం 7,857 మాత్రమే. విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేదు. మేం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టాం. విద్యకు మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుంది. నిర్వహణ నుంచి నియామకాల వరకు 65 రోజుల్లో 11062 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తున్నాం. ఇది విద్యపై మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది. తెలంగాణలో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష.

అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించాం. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని టెట్ నిర్వహణ తర్వాతే డీఎస్సీ నిర్వహించాం. టీజీపీస్సీని ప్రక్షాళన చేసాం. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించి తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తాం. మొదటి ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నాం. టీచర్ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం కాదు.. అది ఒక భావోద్వేగం. గత పదేళ్లలో విద్య నిర్లక్ష్యానికి గురైంది. మేం వచ్చాక విద్యాశాఖకు నిధుల కేటాయింపు పెంచాం. భవిష్యత్ లో మరిన్ని నిధులు కేటాయిస్తాం. గత ప్రభుత్వం స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించలేదు. అందుకే మా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంది. 100 నియోజకవర్గాల్లో 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మధిరలో ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వం టీచర్ల పదోన్నతులు, బదిలీలు చేపట్టలేదు. మా ప్రభుత్వం వివాదాలకు తావు లేకుండా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసింది.

కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై మాపై దుష్ప్రచారం చేస్తున్నాయి. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. అందుకే ఈ ఉపద్రవం వచ్చింది. వాటన్నింటిని పరిష్కరించుకుంటూ మేం ముందుకెళుతున్నాం. విద్యపై పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి అని మేం భావిస్తున్నాం. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయంలేకుండా ప్రభుత్వ పాఠాశాలలు నిర్వహిస్తాం. పేదలకు విద్య అందించడమే మా విధానం. పాఠశాల ఫీజుల నియంత్రణపై త్వరలో కమిటీ వేస్తామని సీఎం రేవంత్‌ ఈ సందర్భంగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
4గంటల దూరానికి 40 ఏళ్లు పట్టిందిః మోదీ
4గంటల దూరానికి 40 ఏళ్లు పట్టిందిః మోదీ
BCCI బ్యాంక్ బ్యాలెన్స్: జయ్ షా నేతృత్వంలో కొత్త చరిత్ర!
BCCI బ్యాంక్ బ్యాలెన్స్: జయ్ షా నేతృత్వంలో కొత్త చరిత్ర!