TG MBBS Admissions 2024: మేనేజ్‌మెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి వెబ్‌ఆప్షన్లు
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యారుల ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వర్సిటీ నోటిఫై చేయడంతో విద్యారులు తమ ధ్రువపత్రాలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్‌లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించి..
హైదరాబాద్, సెప్టెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన విద్యారుల ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వర్సిటీ నోటిఫై చేయడంతో విద్యారులు తమ ధ్రువపత్రాలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్‌లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించి అర్హులైన అభ్యర్ధులకు సంబంధించిన తుది మెరిట్ లిస్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 2వ తేదీ మధ్యాహ్నం వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటనలో పేర్కొంది. ప్రైవేటు వైద్య కళాశాలలతో పాటు నీలిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అడ్మిషన్ల కోసం వెబ్‌ఆప్షన్లు ఇవ్వొచ్చని ఈ సందర్భంగా సూచించింది.
ఇక మేనేజ్‌మెంట్ సీట్లకు గతేడాది నిర్దేశించిన ఫీజులే అమలవుతాయని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు, ఆర్మీ డెంటల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద అడ్మిషన్లకు సంబంధించి అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చింది.
అక్టోబర్ 6న ఐబీపీఎస్ క్లర్క్స్ మెయిన్స్ పరీక్ష.. వెబ్‌సైట్లో అడ్మిట్‌కార్డులు
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 6వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఐబీపీఎస్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్ 6వ తేదీన మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మాత్రమే ఈ పరీక్ష ఉంటుంది. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 6,128 క్లర్క్ పోస్టుల భర్తీ చేయనున్నారు.
ఐబీపీఎస్ క్లర్క్స్ మెయిన్స్ అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.