TTD Tirupati Jobs 2024: నెలకు రూ.2 లక్షల జీతంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో పలు ఉద్యోగాల భర్తీకి తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు..
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో పలు ఉద్యోగాల భర్తీకి తిరుపతిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. అలాగే హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత కలిగిన వారు ఎవరైనా ఆఫ్‌లైన్ విధానంలో అక్టోబర్ 7, 2024వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 3 మిడిల్ లెవల్ కన్సల్టెంట్ పోస్టుల కోసం ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆఫీస్ మేనేజ్‌మెంట్ లేదా రెలీజియస్ ఆర్గనైజేషన్ తదితరాల విభాగంలో 10 నుంచి 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి. అలాగే ఐటీ/ అనలిటికల్/ కమ్యూనికేషన్ తదితరాల్లో నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.2 లక్షల జీతంతో పాటు అవసరమైన వసతి, ల్యాప్‌టాప్ సౌకర్యం కల్పిస్తారు. ఎంపికైన అభ్యర్ధులు తిరుపతి లేదా తిరుమలలో పనిచేయవల్సి ఉంటుంది. నింపిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
అడ్రస్..
The Chief Executive Officer, Sri Lakshmi Srinivasa Manpower Corporation, Old Alipiri Guest House, Tirupati, AP. Pin – 517501.
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్ ఐడీ: recruitments.slsmpc@gmail.com