SSC Recruitment: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఖాళీలు.. ఎలా ఎంపిక చేస్తారో తెలుసా.?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా సివిల్, ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), బ్రహ్మపుత్ర బోర్డు, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) వంటి శాఖల్లో ఉన్న ఖాళీలను...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా సివిల్, ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), బ్రహ్మపుత్ర బోర్డు, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO) వంటి శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1324 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* సివిల్, ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, బీఈ, బీటెక్ లేదా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
* అభ్యర్థుల వయసు ఆగస్టు 01వ తేదీ నాటికి 32 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుంచి రూ.1,12,400 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై 26వ తేదీన ప్రారంభమవుతుండగా, ఆగస్టు 16వ తేదీతో ముగియనుంది.
* కంప్యూటర్ బేస్డ్ పరీక్షను అక్టోబర్ నెలలో నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..