AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP PGECET 2023 Counselling: పీజీఈసెట్ 2023 కౌన్సెలింగ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్యమైన తేదీలివే!

రాష్ట్రంలోని యూనివర్శిటీలు, ప్రయివేట్ ఇంజినీరింగ్,ఫార్మసీ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ అడ్మిష‌న్ల కొర‌కు కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసింది ప్రభుత్వం. ఎంటెక్, ఎం ఫార్మాసి, ఫార్మాడి (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కొర‌కు పీజీఈసెట్ లో అర్హత సాధించిన విద్యార్ధులకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిష‌న్ల ప్రక్రియ జ‌రుగుతుంది. రెండేళ్ల ఎంటెక్,రెండేళ్ల ఎం ఫార్మసీ కోర్సుల‌తో..

AP PGECET 2023 Counselling: పీజీఈసెట్ 2023 కౌన్సెలింగ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్యమైన తేదీలివే!
AP PGECET 2023
pullarao.mandapaka
| Edited By: |

Updated on: Jul 30, 2023 | 12:12 PM

Share

అమరావతి, జులై 30: రాష్ట్రంలోని యూనివర్శిటీలు, ప్రయివేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ అడ్మిష‌న్ల కొర‌కు కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసింది ప్రభుత్వం. ఎంటెక్, ఎం ఫార్మాసి, ఫార్మాడి (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కొర‌కు పీజీఈసెట్ లో అర్హత సాధించిన విద్యార్ధులకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిష‌న్ల ప్రక్రియ జ‌రుగుతుంది. రెండేళ్ల ఎంటెక్, రెండేళ్ల ఎం ఫార్మసీ కోర్సుల‌తో పాటు బీ ఫార్మసీ చ‌దివిన విద్యార్ధులు నాలుగో ఏడాది ఫార్మా డీ కోర్సులో నేరుగా చేరేందుకు అడ్మిష‌న్లు జ‌ర‌గ‌నున్నాయి.

కాగా ఈ ఏడాది మే 28 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆన్ లైన్ లో పీజీఈసెట్ కొర‌కు ప‌రీక్షలను ఉన్నత‌విద్యామండ‌లి, వెంక‌టేశ్వర యూనివ‌ర్శిటీ క‌లిపి నిర్వహించాయి. ఎంట్రన్స్ ప‌రీక్షల ఫ‌లితాల‌ను జూన్ లోనే విడుద‌ల చేసారు అధికారులు. అయితే క‌ళశాలల్లో ప్రవేశాల కొర‌కు నిర్వహించే వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను తాజాగా విడుద‌ల చేసారు. గేట్, జీపాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ర్యాంక‌ర్లకు కూడా ఈ కౌన్సెలింగ్ లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది. ముందుగా గేట్, జీపాట్ ఎంట్రన్స్ రాసిన వారికి కౌన్సెలింగ్ లో ప్రాధాన్యత ఇస్తారు.

వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే

  • గేట్, జీపాట్ విద్యార్ధులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు ఆగస్ట్ ఒక‌టో తేదీ నుంచి అవ‌కాశం.
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల‌కు ఫీజు 300,ఇత‌రుల‌కు ఫీజు 600గా నిర్ధార‌ణ‌.
  • గేట్, జీపాట్ విద్యార్ధుల‌కు వెబ్ కౌన్సెలింగ్ తేదీలు..ఆగ‌స్ట్ 9 నుంచి ఆగ‌స్ట్ 26 వ‌ర‌కూ.
  • పీజీఈసెట్ రాసిన విద్యార్ధుల‌కు వెబ్ కౌన్సెలింగ్..ఆగ‌స్ట్ 26 నుంచి సెప్టెంబ‌ర్ 23 వ‌ర‌కూ.

ఇత‌ర వివ‌రాల‌కు వెబ్ సైట్ లో వివ‌రాలు పొందుప‌రిచిన‌ట్లు ఉన్నత‌విద్యామండ‌లి అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు