‘నేను చేసిన తప్పు అదే..! నావాళ్లెవరో.. కాని వాళ్లెవరో అప్పుడే  అర్థమైంది’.. సీనియర్‌ నటుడు నరేష్ మనోగతం

తొలిసారి తొమ్మిదేళ్ల వయసులో ‘పండంటి కాపురం’ సినిమాలో బాలనటుడి నటించాను. తొలినాళ్లలోనే కృష్ణ, విజయనిర్మలతో పాటు ఎస్వీ రంగారావు లాంటి మహానటులతో కలిసి తెర పంచుకోగలిగాను. అప్పుడు పడిన ఆ పునాదే నన్నిలా నిలబెట్టింది. బాలనటుడిగా మొదలుపెట్టి హీరోగా నిలదొక్కుకున్న వాళ్లు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నేనొకణ్ని కావడం నా అదృష్టం. సినిమాలు..

'నేను చేసిన తప్పు అదే..! నావాళ్లెవరో.. కాని వాళ్లెవరో అప్పుడే  అర్థమైంది'.. సీనియర్‌ నటుడు నరేష్ మనోగతం
Senior Actor Naresh
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 30, 2023 | 8:06 AM

‘మళ్లీ పెళ్లి’.. సినిమాతో నానా హంగామా చేసిన నటుడు వీకే నరేశ్‌ ఈ మధ్యకాలంలో సైలెంట్‌ అయిపోయారు. తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో 250కి పైగా చిత్రాల్లో హీరోగా, సహాయనటుడిగా ఎన్ని పాత్రలు పోషించినా సినిమాల విషయంలో మాత్రం నా ఆకలి ఇంకా తీరలేదు. చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో నరేష్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..

‘తొలిసారి తొమ్మిదేళ్ల వయసులో ‘పండంటి కాపురం’ సినిమాలో బాలనటుడి నటించాను. తొలినాళ్లలోనే కృష్ణ, విజయనిర్మలతో పాటు ఎస్వీ రంగారావు లాంటి మహానటులతో కలిసి తెర పంచుకోగలిగాను. అప్పుడు పడిన ఆ పునాదే నన్నిలా నిలబెట్టింది. బాలనటుడిగా మొదలుపెట్టి హీరోగా నిలదొక్కుకున్న వాళ్లు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నేనొకణ్ని కావడం నా అదృష్టం. సినిమాలు వదిలేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. కాకపోతే మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లా. అది నాకు మరో సరికొత్త అనుభవం’.

‘అలా అకస్మాత్తుగా బయటకెళ్లడం తప్పే. ఓవైపు హీరో ఇమేజ్‌ పూర్తిగా చెరిగిపోవడమేకాకుండా ఆర్థికంగానూ చాలా నష్టపోయా. ఇండస్ట్రీలోని కొందరు నాపై దుష్ప్రచారం చేశారు. అప్పుడే నా వాళ్లు ఎవరో, కాని వాళ్లు ఎవరో అర్థమైంది. కాకపోతే నేను సినిమాల్లోకి తిరిగి వచ్చాక కూడా చాలా మంది నన్ను చిన్న చూపు చూశారు. నేను చూసిన రాజకీయ జీవితం నన్ను ధైర్యంగా నిలబడేలా చేసిందంటూ’ నటుడు నరేష్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.