Security Printing And Minting: భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలి.? చివరి తేదీ ఎప్పుడంటే.
Security Printing And Minting Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థ సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్...
Security Printing And Minting Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థ సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ స్థానాల్లో మొత్తం 135 ఖాళీలకుగాను ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంచి జీత భత్యాలు పొందే అవకాశం ఉన్నఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
ముఖ్యమైన విషయాలు..
* నోటిఫికేషన్ ద్వారా వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వారు సోషల్ సైన్సెస్ విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 103000 వరకు జీతాన్ని అందిస్తారు.
* సూపర్ వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిప్లొమా(డైస్టఫ్ టెక్నాలజీ/ పెయింట్ టెక్నాలజీ)/ సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ/ ఇంక్ టెక్నాలజీ/ ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ డిప్లొమా(ఐటీ/ కంప్యూటర్) ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 95910 వరకు చెల్లిస్తారు.
* జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన వారికి రూ. 77160 నెలవారి జీతంగా అందిస్తారు.
* సెక్రటేరియల్ అసిస్టెంట్ కంప్యూటర్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 85570 వరకు నెలవారీ జీతాన్ని అందిస్తారు.
* రాత పరీక్షంగా ఎంపిక చేసే ఈ పరీక్షకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 12.05.2021 నుంచి ప్రారంభమవుతుండగా 11.06.2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు bnpdewas.spmcil.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మధ్యప్రదేశ్ లో జనతా కర్ఫ్యూను ఉల్లంఘించి యువకుల వీరంగం, చేతుల్లో గన్స్ తో వీధుల్లో కాల్పులు
రెండో ఎక్కం చెప్పలేని వరుడు, ఈ పెళ్లి వద్దని చక్కా పోయిన వధువు, ఈ వింత ఎక్కడంటే ?