China Rocket: చైనా రాకెట్ భూమిపై కూలేది ఎక్కడో తెలుసా.? భారీ విధ్వంసం తప్పదంటున్న శాస్త్రవేత్తలు..
China Rocket: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనా ఇప్పుడు మరో విధ్వంసానికి కారణంగా మారుతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా యావత్ ప్రపంచాన్ని భయపెట్టిస్తున్నట్లుగానే..ఈ దేశానికి చెందిన ఓ రాకెట్...
China Rocket: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌కు పుట్టినిల్లు అయిన చైనా ఇప్పుడు మరో విధ్వంసానికి కారణంగా మారుతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా యావత్ ప్రపంచాన్ని భయపెట్టిస్తున్నట్లుగానే..ఈ దేశానికి చెందిన ఓ రాకెట్ ఇప్పుడు మానవాళిని భయాందోళనకు గురి చేస్తోంది. చైనా అంతరిక్ష సంస్థ స్పేస్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా గత నెల 29న లాంగ్ మార్చ్ 5-బీ అనే రాకెట్‌ను ప్రయోగించింది. అయితే కక్ష్యలోకి వెళ్లినట్లే వెళ్లి అదుపు తప్పిందా రాకెట్. దీంతో ప్రస్తుతం ఆ రాకెట్ భూమిపైకి దూసుకొస్తుంది. ఏ క్షణంలోనైనా భూమిని ఢీకొట్టడానికి సిద్ధమవుతోంది. దీంతో ఆ రాకెట్ ఎక్కడ పడుతుందో అని అందరిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే రాకెట్ గమనాన్ని అంచనా వేసిన అమెరికా శాస్ర్తవేత్తలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చైనా రాకెట్ శకాలాలు ఆదివారం ఉదయం 4.30 గంటలకు (భారత కాల మానం ప్రకారం) భూమిని ఢీకొట్టనున్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. మధ్య ఆసియాలోని తుర్క్‌మెనిస్థాన్‌లో కూలే అవకాశం ఉందని పేర్కొంది. రాకెట్ శకలాలు భూమిని ఢీకొన్న చోట విధ్వంసం తప్పదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, చైనా మాత్రం పెద్దగా నష్టమేమి జరగదని చెబుతోంది. శకలాలు భూమిని చేరేలోపే పూర్తిగా కాలిపోతాయని, ప్రమాదం జరిగే అవకాశాలు అతి స్వల్పమేనని చెప్పకొచ్చింది. మరి రాకెట్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ లక్షణాలను గుర్తించే తేనెటీగలు, నెదర్లాండ్స్ లో శిక్షణ నిస్తున్న రీసెర్చర్లు,