Mother’s Day 2021: జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మకు ఏ బహుమతి ఇచ్చిన తక్కువే.. తప్పులను కూడా ఒప్పులుగా భరిస్తూ..

Mother’s Day 2021: 'అమ్మను మించి దైవమున్నదా.. అంటే లేదని చెప్పి తీరాల్సిందే. జీవితాన్ని ఓవరంగా ఇచ్చిన అమ్మకు ఏ బహుమతి ఇచ్చిన తక్కువే. అమ్మ గురించి ఎంత వర్ణించినా..

Mother’s Day 2021: జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మకు ఏ బహుమతి ఇచ్చిన తక్కువే.. తప్పులను కూడా ఒప్పులుగా భరిస్తూ..
Mother’s Day 2021
Follow us
Subhash Goud

|

Updated on: May 09, 2021 | 6:32 AM

Mother’s Day 2021: ‘అమ్మను మించి దైవమున్నదా.. అంటే లేదని చెప్పి తీరాల్సిందే. జీవితాన్ని ఓవరంగా ఇచ్చిన అమ్మకు ఏ బహుమతి ఇచ్చిన తక్కువే. అమ్మ గురించి ఎంత వర్ణించినా తక్కువే. పిల్లల కోసం ఎంతో ప్రేమించే అమ్మ. మాతృదేవోభవ అనే మాటకు నిదర్శనం అమ్మ. ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. అమ్మ అనేది ఈ లోకంలోనే తియ్యని పదం. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు. అందుకే ఆమెను దేవుడి ప్రతిరూపం అని కోలుస్తారు.

నవమాసాలు మోసి..

9 నెలల పాటు ఎన్నో ఇబ్బందులు భరించి జన్మనిచ్చిన అమ్మకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కష్టమొచ్చినా.. కన్నీళ్లు వచ్చినా నోటి వెంట వచ్చేది మొట్టమొదటి మాట అమ్మ. ఈ సృష్టికి మూలం ఎవరంటే అమ్మే అని చెప్పాలి. స్త్రీ జన్మ పరిపూర్ణం అయ్యేది కూడా అమ్మ అయితేనే.

ఈ సృష్టిలో ఎంతో పేరు అమ్మపై ఎన్నో కవితలు, ఎన్నో పాఠాలు ఉన్నాయి. అమ్మత్యాగాలకు గుర్తుకు మదర్స్‌డే జరుపుకొంటాము. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు ఆ పేగుతో ముడిపడి ఉంటుంది బిడ్డ ప్రాణం. ఆ భరోసాతోనే బిడ్డ హాయిగా నిద్రపోగలుగుతాడు. కడుపులో బిడ్డ కదులుతుంటే తల్లి పడే ఆనందం అంతా ఇంతా కాదు. అమ్మ పొత్తిళ్లలోకి తీసుకుని గుండెలకు హతుకోగానే ఏడుపు మానేస్తుంది. తల్లి చీరతో చేసిన ఉయ్యాలోనే బిడ్డ హాయిగా నిద్రపోతుంది. అమ్మ పాడే జోలపాట వింటూ.. అమ్మ నా దగ్గరే ఉందని సంతోషపడుతూ కంటి నిండా నిద్రపోతుంది. అందుకే అమ్మకు అంత విలువ.

అమెరికాకు చెందిన మేరీ జార్వీస్‌ మదర్స్‌డేకు నాంది పలికింది. ఆమె తల్లి జార్‌వీస్‌కు మదర్స్‌ డే ఏర్పాటు చేయాలని కోరిక ఉండేదట. తన ఆశయం నెరవేరకుండానే మే 9 1905న జార్వీస్‌ కన్నుమూశారు. ఆ తర్వాత మేరీ ఆర్వీస్‌ ఈ మదర్స్‌డేకు శ్రీకారం చుట్టారు. మదర్స్‌ డే మే నెలలోని రెండో ఆదివారం జరుపుకోవాలని నిర్ణయించారు. అలాగే అమెరికాలో మదర్స్‌డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని మేరీ ప్రచారం మొదలు పెట్టింది. తర్వాత మాత దినోత్సవాన్ని అంతర్జాతీయ దినంగా ప్రకటించాలని నినాదం తెరపైకి తీసుకువచ్చింది.

మదర్స్‌డే పోస్టల్‌ స్టాంప్‌..

మదర్స్‌డేను సెలవు దినంగా ప్రకటించాలని ముందుగా అమెరికాలోని పశ్చిమ వర్జీనియా రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. 1910లో అధికారికంగా సెలవు దినాన్ని ప్రకటించారు. ఆ తర్వాత యూఎస్‌లోని మిగితా రాష్ట్రాలు కూడా మదర్స్‌ డేను సెలవు దినంగా ప్రకటించాయి. మే నెలలో రెండో ఆదివారాన్ని మదర్స్‌ డేగా గుర్తించి 1914 మే 8వ తేదీన యూఎస్‌ కాంగ్రెస్‌ ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌.. మొదటి జాతీయ మాతృ దినోత్సవాన్ని 1914 మే 9వ తేదీన ప్రకటించారు. మదర్స్‌డేపై 1934లో మొదటిసారి అమెరికా పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసింది. ఇంత ఘన చరిత్ర ఉన్న అమ్మ పండగను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం సంతోషకరమైన విషయం.

ఇవీ కూడా చదవండి:

Mother Day WhatsApp: మ‌ద‌ర్స్ డే విషెస్ ఇలా చెప్పండి.. కొత్త స్టిక్క‌ర్స్‌ ప్యాక్ తీసుకొచ్చిన వాట్సాప్‌..

ఒత్తిడికి లోనైనప్పుడు కనిపించే లక్షణాలు.. ఒత్తిడిని జయించడం ఎలా..?: ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ కీలక సూచనలు