MOTHERS DAY SPECIAL : మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..! దీని వెనుకున్న చరిత్ర తెలిస్తే చేతులెత్తి మొక్కుతారు..

International Mother's Day : ఈ లోకంలోఅమ్మను మించిన దైవం లేదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు పెద్దలు.

MOTHERS DAY SPECIAL : మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..! దీని వెనుకున్న చరిత్ర తెలిస్తే చేతులెత్తి మొక్కుతారు..
Mothers Day
Follow us
uppula Raju

|

Updated on: May 09, 2021 | 6:43 AM

International Mother’s Day : ఈ లోకంలోఅమ్మను మించిన దైవం లేదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు పెద్దలు. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవ్వరికైనా అమ్మే తొలి గురువు. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడకను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పుచేసినా కడుపులో దాచుకుని కనికరిస్తుంది. అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం.

ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేని వాడు కాదు అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. అందుకే అమ్మ ప‌ట్ల మ‌న‌కు ఉన్న ప్రేమ‌ను చాటుకోవ‌డానికి ఇంతక‌న్నా మంచి త‌రుణం ఇంకోటి ఉండ‌దు. మరోవైపు, ఏటా మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీనికి సుదీర్ఘ చరిత్ర, ఓ నేపథ్యం ఉంది.

గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. ‘జూలియవర్డ్‌ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్‌ అనే మహిళ ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది.

ఆమె 1905 మే 9న మృతిచెందగా, ఆమె కుమార్తె మిస్‌ జెర్విస్‌ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపడం మొదలైంది. ఫలితంగా 1914నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Mother Day WhatsApp: మ‌ద‌ర్స్ డే విషెస్ ఇలా చెప్పండి.. కొత్త స్టిక్క‌ర్స్‌ ప్యాక్ తీసుకొచ్చిన వాట్సాప్‌..

Mother’s Day 2021: జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మకు ఏ బహుమతి ఇచ్చిన తక్కువే.. తప్పులను కూడా ఒప్పులుగా భరిస్తూ..