Mother Day WhatsApp: మ‌ద‌ర్స్ డే విషెస్ ఇలా చెప్పండి.. కొత్త స్టిక్క‌ర్స్‌ ప్యాక్ తీసుకొచ్చిన వాట్సాప్‌..

Mother Day Stickers WhatsApp: ‘ఆడ‌త‌నం దేశానికి ఒక‌లా ఉన్నా.. అమ్మ‌త‌నం మాత్రం ఎక్క‌డైనా ఒకేలా ఉంటుంది’.. ఇది ఓ సినిమాలోని డైలాగ్. నిజ‌మే అమ్మ‌త‌నం ఎక్క‌డైనా ఒకేలా ఉంటుంది...

Mother Day WhatsApp: మ‌ద‌ర్స్ డే విషెస్ ఇలా చెప్పండి.. కొత్త స్టిక్క‌ర్స్‌ ప్యాక్ తీసుకొచ్చిన వాట్సాప్‌..
Mother Day Stckers
Follow us
Narender Vaitla

|

Updated on: May 09, 2021 | 6:13 AM

Mother Day Stickers WhatsApp: ‘ఆడ‌త‌నం దేశానికి ఒక‌లా ఉన్నా.. అమ్మ‌త‌నం మాత్రం ఎక్క‌డైనా ఒకేలా ఉంటుంది’.. ఇది ఓ సినిమాలోని డైలాగ్. నిజ‌మే అమ్మ‌త‌నం ఎక్క‌డైనా ఒకేలా ఉంటుంది. త‌ల్లి ఎప్పుడూ త‌న బిడ్డ క్షేమం కోస‌మే ఆలోచిస్తుంది. ఈ సృష్టిలో ఎలాంటి స్వార్థం లేని ప్రేమ ఒక్క త‌ల్లిదే అన‌డంతో ఎలాంటి అతిశ‌యోక్తి ఉండ‌దేమో. తాను తిన‌క‌పోయినా బిడ్డ ఆక‌లి తీర్చాలనుకుంటుంది త‌ల్లి. అలాంటి గొప్ప వ్య‌క్తిని పూజించుకోవ‌డానికి ఉందే మాతృ దినోత్స‌వం. ప్ర‌తీ ఏటా మే నెలలో మాతృ దినోత్స‌వం జ‌రుపుకుంటార‌నే విష‌యం తెలిసిందే. మీరు కూడా మీ అమ్మ‌కు మాతృ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్పాల‌నుకుంటున్నారా.? అయితే మాములుగా చెబితే స్పెష‌ల్ ఏముంటుంది చెప్పండి. మారుతోన్న టెక్నాల‌జీకి అనుగుణంగా స్పెష‌ల్ విషెస్ చెప్పండి. ఇందుకోస‌మే ప్ర‌ముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్ర‌త్యేకంగా స్టిక్క‌ర్లు తీసుకొచ్చింది. మ‌ద‌ర్స్ స్టిక్క‌ర్స్ క‌లెక్ష‌న్‌లో భాగంగా మొత్తం 11 స్టిక్క‌ర్లు విడుద‌ల చేసింది.

ఈ స్టిక్క‌ర్ల‌ను మీ మొబైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

* ఇంద‌కోసం ముందుగా వాట్సాప్ ఓప‌న్ చేయాలి.

* అనంత‌రం స్క్రీన్ కింద స్టిక్క‌ర్ ఐకాన్‌లోకి వెళ్లి + బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి.

* అందులో కొత్త‌గా విడుద‌ల చేసిన ‘మామా లవ్’ స్టిక్కర్ ప్యాక్ ఉంటుంది.

* దాన్ని డౌన్‌లోడ్ చేయ‌గానే మీ స్టిక్క‌ర్స్ సెక్ష‌న్‌లోకి యాడ్ అవుతుంది.

* ఆయా స్టిక్క‌ర్ల‌ను ఎంచ‌క్కా మీరు కోరుకున్న వ్య‌క్తుల‌కు షేర్ చేసుకోవ‌చ్చు.

Also Read: Dhethadi Harika: డాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన దేత్తడి హారిక.. వైరల్ అవుతున్న వీడియో..

Corona: వేడి నీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చా..? ఇది నిజమేనా..? ప్రభుత్వం ఏమంటుందో తెలిస్తే షాకవుతారు..

Fact Check: ఈ లింక్‌పై క్లిక్ చేస్తే టీకాకు రిజిస్టర్ చేసుకోవచ్చా.? ఇందులో నిజమెంత.!