AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ఈ లింక్‌పై క్లిక్ చేస్తే టీకాకు రిజిస్టర్ చేసుకోవచ్చా.? ఇందులో నిజమెంత.!

Covid Vaccination Update: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మే 1వ తేదీ నుంచి అనేక రాష్ట్రాల్లో..

Fact Check: ఈ లింక్‌పై క్లిక్ చేస్తే టీకాకు రిజిస్టర్ చేసుకోవచ్చా.? ఇందులో నిజమెంత.!
Corona Vaccine
Ravi Kiran
|

Updated on: May 08, 2021 | 8:27 PM

Share

Covid Vaccination Update: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మే 1వ తేదీ నుంచి అనేక రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్పీడ్‌గా విస్తరిస్తోంది. తాజాగా ప్రజలను మభ్య పెట్టేలా ఓ పుకారు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టీకా కోసం నమోదు చేసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాలంటూ ఓ మెసేజ్ నెట్టింట హల్చల్ చేస్తోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తాజాగా వివరణ ఇచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశంలో, 18 సంవత్సరాలు పైబడిన వారు ఈ లింక్ ద్వారా టీకాకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఉంది. ఇక పీఐబీ ఫ్యాక్ట్ చెక్ దీనిపై వివరణ ఇస్తూ.. అదంతా అవాస్తవమని స్పష్టం చేసింది. ఆ మెసేజ్ లో ఇచ్చిన లింక్ నకిలీదని పేర్కొంది. కాగా, కరోనా టీకా నమోదు కోసం http://cowin.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని వెల్లడించింది.

టీకా కోసం ఎక్కడ నమోదు చేయాలి…

18 ఏళ్లు పైబడిన వారు టీకా కోసం కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు లేదా ఉమాంగ్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా, ప్రైవేట్ టీకా కేంద్రాలలో కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో, మీరు ప్రైవేట్ లేదా ప్రభుత్వ టీకా కేంద్రాలను ఎన్నుకునే అవకాశాన్ని పొందుతారు.

కాగా, దేశంలో ఇప్పటివరకు 16.49 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు తయారు చేయగా.. ఇందులో 3.28 కోట్ల మందికి రెండు మోతాదులు ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా గురువారం 23.70 లక్షల మోతాదులను దరఖాస్తు చేసుకున్నారు.

ఇవీ చదవండి:

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!