కోవిడ్ రోగి అంత్యక్రియలకు 150 మంది హాజరు, 21 మంది మృతి, ఖండించిన అధికారులు
రాజస్తాన్ సికార్ జిల్లాలోని ఓ గ్రామంలో మృతి చెందిన కోవిడ్ రోగి అంత్యక్రియలకు సుమారు 150 మంది హాజరయ్యారు. ఎలాంటి కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించకుండా ఆ డెడ్ బాడీ ఖనన కార్యక్రమానికి వీరంతా హాజరయ్యారని అనధికార వర్గాలు తెలిపాయి.
రాజస్తాన్ సికార్ జిల్లాలోని ఓ గ్రామంలో మృతి చెందిన కోవిడ్ రోగి అంత్యక్రియలకు సుమారు 150 మంది హాజరయ్యారు. ఎలాంటి కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించకుండా ఆ డెడ్ బాడీ ఖనన కార్యక్రమానికి వీరంతా హాజరయ్యారని అనధికార వర్గాలు తెలిపాయి. అయితే గ్రామంలో ఆ తరువాత 21 మంది మరణించారు. కానీ అధికారులు మాత్రం ఏప్రిల్ 15-మే 5 మధ్య నలుగురు మాత్రం మృతి చెందినట్టు చెబుతున్నారు. అసలు విషయానికి వస్తే.. ఈ జిల్లాలోని ఖీర్వా గ్రామంలో గతనెల 21 న కోవిడ్ రోగి ఒకరు మరణించారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేసేందుకు, చివరిసారిగా చూసేందుకు దాదాపు 150 మంది అక్కడ చేరారట. ఆ సందర్భంగా ఎవరూ కోవిడ్ నిబంధనలను పాటించిన దాఖలాలు కనబడలేదు. ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి ఆ మృతదేహాన్ని బయటకు తీయగానే అనేకమంది దాన్ని తాకారని తెలిసింది. మరి వీరంతా ఆ వ్యక్తి సహచరులా లేక ఆయనను గురుజీగా భావించినవారా అన్న విషయం తెలియలేదు. అనంతరం ఖీర్వా గ్రామంలో 21 మంది మృతి చెందారు. కానీ వీరిలో ముగ్గురు, నలుగురు మాత్రం మరణించారని,మృతుల్లో చాలామంది వయస్సు మళ్లినవారని అధికారులు తెలిపారు. కోవిడ్ కమ్యూనిటీ (సామూహిక) వ్యాప్తి చెందిందా అని నిర్ధారించుకోవడానికి తాము ఈ కుటుంబాలకు చెందిన 147 మంది సభ్యుల శాంపిల్స్ సేకరించామని సబ్ డివిజినల్ ఆఫీసర్ కల్రాజ్ మీనా చెప్పారు. ఎందుకైనా మంచిదని ఈ గ్రామమంతా శానిటైజ్ చేయించామని, మొదట్లో గ్రామీణులు తమకు సహకరించలేదని ఆయన చెప్పారు. చివరకు తాము నచ్చజెప్పామన్నారు. ఏది ఏమైనా ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొత్వాలా ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ గ్రామం ఉంది. మరణించిన కోవిద్ రోగి మృతదేహాన్ని ఇంతమంది ముట్టుకున్నందుకే 21 మంది మరణించారని ఆయన తన ట్విటర్ లో తెలిపారు. కానీ ఆ తరువాత దాన్ని తొలగించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Corona: వేడి నీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చా..? ఇది నిజమేనా..? ప్రభుత్వం ఏమంటుందో తెలిస్తే షాకవుతారు..