Corona: వేడి నీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చా..? ఇది నిజమేనా..? ప్రభుత్వం ఏమంటుందో తెలిస్తే షాకవుతారు..
Covid 19 Myths: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతీ రోజూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూపోతోంది...
Covid 19 Myths: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతీ రోజూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూపోతోంది. ఈ తరుణంలో ప్రజలు వైరస్ సోకకుండా ఉండేందుకు పలు రకాల మార్గాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓ పుకారు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నానం చేయడం లేదా వేడి నీటిని తాగడం వల్ల కరోనా వైరస్ ను నిరోధించవచ్చా.? అని ఓ ప్రశ్న పలువురు నెటిజన్ల మనస్సుల్లో తలెత్తింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. mygovindia ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చింది.
వేడి నీటితో స్నానం చేయడం లేదా వేడి నీటిని తాగడం ద్వారా కరోనాను నివారించలేమని కేంద్రం స్పష్టం చేసింది. అలా చేయడం ద్వారా వైరస్ ను చంపడం లేదా వ్యాధిని నయం చేయడం జరగదని.. అవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని వెల్లడించింది. కాగా, కోవిడ్ -19ను తొలగించేందుకు ముక్కులో రెండు చుక్కలు నిమ్మరసం వేసుకోవాలనే పుకారును ఇటీవల ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!
Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!
Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!