Horoscope Today : ఈ రాశివారు ఆస్తుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. మే 9న రాశిఫలాలు ఇలా ఉన్నాయి..

ప్రస్తుత కాలంలోనూ రాశిఫలాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే...

Horoscope Today : ఈ రాశివారు ఆస్తుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. మే 9న రాశిఫలాలు ఇలా ఉన్నాయి..
Rashi Phalalu

Horoscope Today : ప్రస్తుత కాలంలోనూ రాశిఫలాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే కొన్ని సంఘటనల గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ రోజు మే 9 ఆదివారం నాడు మేషరాశి నుంచి మీన రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి..

ఈరోజు వీరు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అప్పులు ఇవ్వడం, తీసుకుకోవడం  చేస్తుంటారు. గోసేవ చేయడం మంచింది.

వృషభ రాశి..

ఈరోజు వీరు చేదు ఆలోచనలు రాకుండా భగవంతుని సన్నిధిలో గడపడం మంచింది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

మిధున రాశి..

ఈరోజు వీరికి మానసికంగా కాస్త ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. శివ పంచాక్షరీ స్త్రోత్ర పారయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈరోజు ఈ రాశివారికి ప్రయోజనాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. చ్చదువు చెప్పిన గురువులను దర్శించుకోవడం మంచింది.

సింహరాశి..

ఈరోజు వీరు శుభఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది.

కన్యా రాశి..

ఈరోజు వీరు ప్రయాణ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకొనిప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాది విషయాల్లో కొన్ని కీలకమైన సందర్భాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

తులారాశి..

ఈరోజు వీరికి భోగభాగ్యాలు పొందుతుంటారు. పెట్టుబడుల్లో మంచి అనుకూల వాతావరణం చోటుచేసుకుంటుంది. సుబ్రమణ్య స్వయం దర్శనం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరు నిర్ణయాల్లో తొందపడుతుంటారు. ఆహారవిహారధుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుకోవాల్సి ఉంటుంది.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరికి ఇతరులకు ఇచ్చే హామీలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. కుటుంబంలో కొంత అనుకూలమైన వాతావరణాన్ని పొందుతారు.

మకర రాశి..

ఈరోజు వీరు ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. పెదవారికి అన్నవస్త్రదానం చేయడం మంచిది.

కుంభరాశి..

ఈరోజు వీరికి  ఈ రోజు విశ్రాంతి కోసం ఆలోచన చేస్తుంటారు. ఖర్చుల విషయంలో నియంత్రణను పటించుకోవడం మంచింది.

మీనరాశి..

ఈరోజు ఈ రాశివారు ఆస్తుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సుబ్రమణ్యస్వామి ఆరాధనా మేలు చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mother’s Day 2021: ‘అమ్మ’ సృష్టికే మూలం.. అమ్మ ముద్దుల వెనుకే కాదు.. దెబ్బల వెనుక కూడా అపారమైన ప్రేమ ఉంటుంది