AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశుల వారికి ఉద్యోగాలు, వ్యాపారాల విషయాల్లో ఒత్తిడి ఉంటుంది.. ఈరోజు రాశి ఫలాలు..

Rasi Phalalu on may 10th 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు

Horoscope Today: ఈ రాశుల వారికి ఉద్యోగాలు, వ్యాపారాల విషయాల్లో ఒత్తిడి ఉంటుంది.. ఈరోజు రాశి ఫలాలు..
Horoscope Today
Rajitha Chanti
|

Updated on: May 10, 2021 | 6:52 AM

Share

Rasi Phalalu on may 10th 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ ఈరోజు సోమవారం (మే 10న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేషరాశి..

ఈరోజు వీరికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తోటివారి సహకారాన్ని పొందుతుంటారు. విష్ణుమూర్తిని ధానం చేసుకోవడం.. పూజా చేసుకోవడం.. విష్ణుమూర్తి సంబంధమైన స్తోత్రాలు చదవుకోవడం మంచిది.

వృషభరాశి..

ఈరోజు వీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా..వ్యక్తిగత కార్యక్రమాల్లో శ్రద్ధ తీసుకుంటుండాలి. మహాలక్ష్మీ అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

మిథున రాశి..

ఈరోజు వీరు శారీరక శ్రమ పెరుగుతుంది. పనులలో కొంత ఒత్తిడి ఇబ్బందులకు గురిచేస్తుంది. పరమేశ్వరుడి అర్చన, ఆరాధనలు చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి..

ఈరోజు వీరికి విశ్రాంతి లోపాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పేదవారి ఆరోగ్యం కోసం ఆర్థికంగా సహకరించడం మంచిది.

సింహరాశి..

ఈరోజు వీరు సమిష్టి నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో కుటుంబసభ్యుల యొక్క సహాకారాన్ని కోరుకుంటుంటారు. సుబ్రమణ్య స్వామి అర్చన మేలు చేస్తుంది.

కన్యరాశి..

ఈరోజు వీరికి సంఘంలో గౌరవాలు పెరుగుతుంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. శ్రీరాముని నామస్పరణ మేలు చేస్తుంది.

తులారాశి..

ఈరోజు వీరికి వృత్తి, వ్యాపారాత్మకమైన భావనలను పెరుగుతుంటాయి. పేదవారికి కాయగూరలు ధానం చేసుకోవడం మంచిది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరికి అనారోగ్య సంబంధమైన భావనలను తగ్గించుకోవాలి. అనవరసమైన కార్యక్రమంలో జోక్యం చేసుకోకూడదు. శ్రీరాముని నామస్మరణ చేసుకోని.. పేదవారికి అన్నధానం చేయడం మంచిది.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరికి వృత్తి, వ్యాపారాత్మకంగా కొన్ని పనులు అవసరమవుతుంటాయి. ప్రముఖుల సలహాలు మేలు చేస్తుంది. శ్రీరాజామాతంగై నమః మేలు చేస్తుంది.

మకర రాశి..

ఈరోజు వీరు వ్యతిరేకతలపైన విజయాలను సాధించుకోగలుగుతారు. పట్టుదలతో చేపట్టి పనులన్ని పూర్తిచేసుకుంటారు. మహాలక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించాలి.

కుంభరాశి..

ఈరోజు వీరికి సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీకృష్ణుని అర్చన చేసుకోని.. వెన్నను నివేదన చేసుకోండి.

మీనరాశి..

ఈరోజు వీరికి సౌకర్యాల వలన కొంత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పరమేశ్వరునికి బిల్వార్చన నిర్వహించడం మంచిది.

Also Read: రాత్రిళ్లు భక్తుల ప్రాణాలను తీసే అమ్మవారి ఆలయం.. నైట్ అయితే చాలు భయంతో పారిపోతున్న జనం.. ఆ గుడి ఎక్కడుందంటే..

మనదేశంలో ఉన్న నమ్మశక్యం కానీ అత్యంత ప్రసిద్ధి చెందిన దుర్గా దేవి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..