Kabul Blast: కాబుల్‌లో మరోసారి బాంబుల మోత​.. పాఠశాల సమీపంలో పేలుడు.. 40 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్​ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది0. కాబుల్‌లోని ఓ పాఠశాల సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40మంది అక్కడికక్కడే మృతి చెందారు.

Kabul Blast: కాబుల్‌లో మరోసారి బాంబుల మోత​.. పాఠశాల సమీపంలో పేలుడు.. 40 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Blasts Targeting Afghan School In Kabul
Follow us

|

Updated on: May 08, 2021 | 9:02 PM

Blasts targeting Afghan school: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్​ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది0. కాబుల్‌లోని ఓ పాఠశాల సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40మంది అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయినవారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు అఫ్గాన్​ ప్రభుత్వం తెలిపింది. మరో 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్​ నాజరి తెలిపారు.

పేలుడు జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామని అఫ్గాన్ మంత్రి తారీఖ్​ అరియాన్​ తెలిపారు. అయితే, అంబులెన్సులను అడ్డుకుని ప్రజలు దాడులకు తెగబడ్డారని దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి గులాం దస్తగిర్​ నాజరి అన్నారు. వారిని సముదాయించి అంబులెన్సులు వెళ్లేలా చేశామన్నారు. కాగా, ఈ దాడులకు పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే ఇటీవల అదే ప్రాంతంలో షీతేస్​ మైనార్టీలపై దాడి చేసింది తామేనని ఇస్లామిక్​ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అఫ్గాన్​ నుంచి అమెరికా బలగాలు తమ దేశానికి పయనమైన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.

Read Also… కోవిడ్ రోగి అంత్యక్రియలకు 150 మంది హాజరు, 21 మంది మృతి, ఖండించిన అధికారులు

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!