Secunderabad Cantonment: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్‌లో వైద్య సంబంధిత ఉద్యోగాలు.. అనుభవం ఆధారంగా ఎంపిక..
Secunderabad Cantonment Board Recruitment: కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే...
Secunderabad Cantonment Board Recruitment: కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించే క్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఆధారంగా పలు వైద్య సబంధిత పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలోని కోవిడ్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన విషయాలు…
* జనరల్ ఫిజిషియన్ విభాగంలో ఒక ఖాళీని భర్తీ చేయనున్నారు. దీనికి జనరల్ మెడిసిన్ విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇక ఆ విభాగంలో 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. లక్షన్నర జీతంగా అందించనున్నారు.
* డ్యూటీ మెడికల్ ఆఫీసర్ విభాగంలో 5 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.60000 వరకు జీతంగా అందించనున్నారు.
* సూపర్ వైజర్ 2 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికి బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. ఎంపికైన వారికి నెలకు రూ. 35000 జీతాన్ని అందిస్తారు.
* నర్సింగ్ ఇన్‌ఛార్జి విభాగంలో 1 పోస్టును భర్తీ చేయనున్నారు. ఇందుకోసం బీఎస్సీ నర్సింగ్/జఈఎన్ఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టుకు ఎంపికై వారికి నెలకు రూ. 40000 జీతంగా అందిస్తారు.
* 20 నర్సింగ్ స్టాఫ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెలకు రూ. 30000 వరకు జీతంగా చెల్లిస్తారు.
* నోటిషికేషన్‌లో భాగంగా 03 ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు డీఫార్మా/బీఫార్మా పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టుకు అప్లై చేసుకోవాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఏడాది అనుభం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 30000 వరకు జీతాన్ని అందిస్తారు.
* 3 ప్లెటొటోమిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది పని అనుభవం ఉండాలి. ఎంపికై వారికి నెలకు రూ. 30000 వరకు జీతాన్ని అందిస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్‌ను నింపి ceo.scb2009@gmail.com ఐడీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది.
* దరఖాస్తుకు చివరి తేదీగా 17.05.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి..
Prabhas: 2025 వరకు ప్రభాస్ ఫుల్ బిజీ.. డేట్స్ అసలు ఖాళీ లేవట..?