CCRAS Recruitment 2021: ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సీసీఆర్ఏఎస్‌లో ఉద్యోగాలు.. ద‌రఖాస్తుకు రేపే చివ‌రి తేదీ..

CCRAS Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ కౌన్సిల‌ర్ ఫ‌ర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌ర్ జారీ చేశారు. దేశ రాజ‌ధాని..

CCRAS Recruitment 2021: ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సీసీఆర్ఏఎస్‌లో ఉద్యోగాలు.. ద‌రఖాస్తుకు రేపే చివ‌రి తేదీ..
Ccras Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: May 09, 2021 | 6:06 AM

CCRAS Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ కౌన్సిల‌ర్ ఫ‌ర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్‌)లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌ర్ జారీ చేశారు. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ఉన్న సీసీఆర్ఏఎస్ లో కాంట్రాక్ట్ విధానంలో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప‌లు విభాగాల్లో మొత్తం 6 పోస్టుల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ప్రోగ్రాం మేనేజ‌ర్ విభాగంలో 2 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా అడ్మినిస్ట్రేష‌న్‌, అకౌంట్స్‌/ ఫైనాన్స్ విభాగంలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి హాస్పిట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ఫైనాన్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

* జూనియ‌ర్ ప్రోగ్రాం మేనేజ‌ర్ విభాగంలో రెండు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. , సిద్దా, యునానీ ఏదైనా ఒక దానిలో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

* డేటా అన‌లిస్ట్ విభాగంలో ఉన్న ఒక ఖాళీని భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు అప్లై చేసుకునే వారు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అలాగే.. కంప్యూట‌ర్ నాలెడ్జ్‌తో పాటు టైపింగ్ స్పీడ్ ఉండాలి.

* ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్హ‌త‌తో మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌) విభాగంలో ఖాళీగా ఉన్న 1 పోస్టును భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుకు అప్లై చేసుకునే వారి 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

* క‌రోనా నేప‌థ్యంలో ఈ ఉద్యోగాల‌ను ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయ‌నున్నారు.

* అర్హ‌త‌,ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీగా 10.05.2021 నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు http://www.ccras.nic.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. పేరొందిన ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Google Digital Marketing Course: ఉచితంగా డిజిట‌ల్ మార్కెటింగ్ కోర్సు అందిస్తోన్న‌ గూగుల్.. స‌ర్టిఫికేట్ కూడా..

BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్‌లో మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది ఎప్పుడంటే..