BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్‌లో మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది ఎప్పుడంటే..

BHEL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష్ జారీ చేసింది. తిరుచిర‌ప‌ల్లి బీహెచ్ఈఎల్‌లో పార్ట్ టైం మెడిక‌ల్ క‌న్స‌లెంట్లు...

BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్‌లో మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది ఎప్పుడంటే..
Bhel Jobs
Narender Vaitla

|

May 08, 2021 | 6:01 AM

BHEL Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష్ జారీ చేసింది. తిరుచిర‌ప‌ల్లి బీహెచ్ఈఎల్‌లో పార్ట్ టైం మెడిక‌ల్ క‌న్స‌లెంట్లు (పీటీఎంసీ) స్పెష‌లిస్టుల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం ప‌లికింది.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 11 పార్ట్ టైం మెడిక‌ల్ క‌న్స‌ల్టెంట్లు (పీటీఎంసీ) స్పెష‌లిస్టులు పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఇందులో భాగంగా.. డెర్మ‌టాల‌జీ, డ‌యాబెటియాల‌జీ, గైన‌కాల‌జీ&అబ్‌స్టెట్రిక్స్‌, ఆప్త‌ల్మాల‌జీ, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, రేడియాల‌జీ, ఆంకాల‌జీ, యూరాల‌జీ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

* ఈ పోస్టుల‌కు అప్లై చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు.. సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

* ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు 01.05.2021 నాటికి 64 ఏళ్లు మించ‌కూడ‌దు.

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ, సర్టిఫికేష‌న్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు recruit@bhel.inకి వివ‌రాలు పంపించాల్సి ఉంటుంది.

* ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల‌కునే అభ్య‌ర్థులు తిరుచిర‌ప‌ల్లి బీహెచ్ఈఎల్ చిరునామాకు పంపించాలి.

* ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేదీగా 15.05.2021 నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు https://careers.bhel.in/bhel/jsp/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: ఈ ఆలయంలో హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తుంటారు… ఇంతకీ ఆ గుడి ఎక్కడుందో తెలుసా..

Viral Video : రెండు చిరుత పులుల మధ్య భీకర యుద్దం..! అదీ చెట్టుపై నుంచి.. మీరు ఓ లుక్కేయండి..

TS CS: త్వరగా ఆక్సిజన్ రప్పించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు.. ప్రత్యేక బ‌ృందాలు ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu