IIIT Sri City Recruitment: శ్రీ సిటీ ఐఐఐటీలో టీచింగ్ ఉద్యోగాలు… ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

IIIT Sri City Recruitment 2021: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరులో జిల్లాలో ఉన్న ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఐఐఐటీ) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. శ్రీసిటీలో ఉన్న...

IIIT Sri City Recruitment: శ్రీ సిటీ ఐఐఐటీలో టీచింగ్ ఉద్యోగాలు... ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..
Sri City Iiit
Follow us
Narender Vaitla

|

Updated on: May 08, 2021 | 6:00 AM

IIIT Sri City Recruitment 2021: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని చిత్తూరులో జిల్లాలో ఉన్న ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ (ఐఐఐటీ) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. శ్రీసిటీలో ఉన్న ఈ క్యాంపస్‌లో టీచింగ్ పోస్టుల భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మెయిల్ లేదా ఆఫ్‌లైన్ విధానం ద్వారా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలిపారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్న పోస్టులు.. 1) కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్‌/అసోసియేట్ ప్రొఫెస‌ర్లు 2) మ్యాథ‌మేటిక్స్‌/డేటా అన‌లిటిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు.

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు సంబంధిత స‌బ్జెక్టుల్లో పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత అనుభ‌వం క‌లిగి ఉండాలి.

* అప్లై చేసుకున్న అభ్య‌ర్థుల‌ను విద్యార్హ‌త‌లు, అనుభ‌వం, స్పెష‌లైజేష‌న్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల్ని ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంచుకుంటారు.

* ఈ మెయిల్ లేదా ఆఫ్‌లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవ‌చ్చు.

* ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల‌నుకునే వారు careers.faculty@iiits.in వివ‌రాలు పంపించాల్సి ఉంటుంది.

* ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు చిత్తూరు శ్రీసిటీ (ఐఐఐటీ) క్యాంప‌స్‌కు ఉత్త‌రం ద్వారా పంపిచాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీగా 11.06.2021 నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు http://iiits.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Also Read: నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..! ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.. తెలుసుకోండి..

Heart Breaking Event: చంటి బిడ్డకు పాలిస్తూ కుప్పకూలిన తల్లి.. భర్త చేరుకునేలోపే అసువులు బాసిన ఇద్దరు.. అసలేం జరిగిందంటే..!

Beauty Tips: వేసవిలో ముఖం మరింత కాంతవంతంగా ఉండేందుకు నిమ్మకాయతో ఇలా ట్రైచేయండి..