- Telugu News Photo Gallery Spiritual photos Theres a temple where lord hanuman is worshipped as a female in girjabandh
ఈ ఆలయంలో హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తుంటారు… ఇంతకీ ఆ గుడి ఎక్కడుందో తెలుసా..
ఆంజనేయుడు.. శ్రీరాముడికి పరమభక్తుడు. భక్తితో పూజిస్తే.. ఎల్లప్పుడూ అభయమిచ్చే కలియుగ దైవంగా హనుమంతున్ని పూజిస్తారు. మనదేశంలో ఆంజనేయుడి ఆలయాలు అనేకం ఉంటాయి. అయితే ఒక ఆలయంలో హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తుంటారు. ఆ గుడి ఎక్కడుందో తెలుసుకుందామా.
Updated on: May 07, 2021 | 9:17 PM

చత్తీస్ ఘర్ రాష్ట్రంలో రతన్ పూర్ జిల్లాలో గిర్జబంద్ లోని ఓ ఆలయంలో హనుమంతుడిని దేవత రూపంలో పూజిస్తుంటారు. ఇక్కడి ఆలయంపై అపారమైన నమ్మకం ఉంది.

ఇక్కడి ఆంజనేయ విగ్రహం రాముడు, సీతాదేవిలను తన భుజలపై మోస్తున్నట్లుగా కనిపిస్తుంటాడు. ఈ ఆలయంలో దేవత రూపంలో ఉన్న హనుమంతున్ని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని విశ్వసిస్తారు.

ఈ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా ఉంది. రతన్ పూర్ రాజు అయిన పృథ్వీ దేవ్ జు ఆ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. రోజు ఆయన కుష్టు వ్యాధికి గురై తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. ఆ సమయంలో హనుమంతుడు అతడి కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తాడు.

ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు మళ్లీ ఆంజనేయుడు రాజు కలలో కనిపించి మహామాయ కుండ్ వద్ద ఓ విగ్రహం ఉంటుందని, దానిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టించాలని ఆదేశించి అదృశ్యమవుతాడు.

హనుమంతుడి సూచనల ప్రకారం ఆ మరుసటి రోజు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ హనుమాన్ విగ్రహం స్త్రీ రూపంలో ఉండడంతో ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత భగవంతుడు తనకిచ్చిన ఆదేశం మేరకే ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయం లోపల ప్రతిష్ట చేస్తాడు. వెంటనే రాజు తన అనారోగ్యం నుంచి విముక్తుడై ఆరోగ్యవంతుడిగా మారతాడు.

రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద ఎయిర్ పోర్ట్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉండే బిలాస్ పూర్ కు నేరుగా క్యాబ్ లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు. అక్కడి నుంచి రతన్ పూర్ కు 28 కిలోమీటర్లు. ఎయిర్ పోర్ట్ నుంచి రతన్ పూర్ చేరుకోవడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది.

ఈ ఆలయాన్ని సందర్శించడానికి శీతాకాలం అనువైనది. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ ఆలయాన్ని సందర్శించేందుకు సరైన సమయం.

ఆంజనేయుడి ఆలయం..




