AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : రెండు చిరుత పులుల మధ్య భీకర యుద్దం..! అదీ చెట్టుపై నుంచి.. మీరు ఓ లుక్కేయండి..

Viral Video : సోషల్ మీడియాలో మిలియన్ల చిత్రాలు, జంతువుల వీడియోలు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి. జంతువులకు

Viral Video : రెండు చిరుత పులుల మధ్య భీకర యుద్దం..! అదీ చెట్టుపై నుంచి.. మీరు ఓ లుక్కేయండి..
Two Leopards
uppula Raju
|

Updated on: May 07, 2021 | 9:02 PM

Share

Viral Video : సోషల్ మీడియాలో మిలియన్ల చిత్రాలు, జంతువుల వీడియోలు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో ఎక్కువగా చూసే కంటెంట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని అందమైనవి, ఇంకొన్ని భయానక వీడియోలు ఉంటాయి.మానవులైనా, జంతువులైనా అందరూ సింహాలు, చిరుతపులికి భయపడతారు. భయంకరమైన జంతువులు రెండూ ఒకే స్థలానికి వస్తే ఏమి జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇటీవల రెండు చిరుతపులుల పోరాట వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

చిరుతపులి ముందు పెద్ద జంతువుల పరిస్థితి మరింత దిగజారిపోతుందని మనందరికీ తెలుసు. చాలా జంతువులు వాటిని చూసిన వెంటనే తోక ముడుస్తాయి. కానీ రెండు చిరుతలు ఒకదానికొకటి ఎదురుపడినపుడు వాటి శైలి చాలా ప్రమాదకరమైనది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అదే అనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అడవి మధ్యలో ఒక చెట్టు మీద చిరుతపులి నిలబడి ఉన్నట్లు మనం చూడవచ్చు. అప్పుడు అకస్మాత్తుగా మరొక చిరుతపులి అక్కడకు వచ్చి రెప్పపాటులో చెట్టు ఎక్కుతుంది. అదే సమయంలో రెండు ఒకదానిపై ఒకటి పడుతుంది.. భీకర యుద్ధం జరుగుతుంది. ఫలితం ఏమిటంటే రెండు పోరాడుతున్నప్పుడు చెట్టుపై నుంచి కింద పడతాయి.

ఈ వీడియో లైఫ్ అండ్ నేచర్ అనే ట్విట్టర్‌ ఖాతాతో లో షేర్ చేయబడింది. ‘ఒక చిరుతపై దాడి చేసే సింహం’ అని ఆయన శీర్షిక ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఒకరికొకరు షేర్ చేసుకుంటూ వివిధ కామెంట్స్ రాస్తున్నారు. వీడియోలో చిరుతపులి దూకుడును చూసి ప్రజలు భయపడుతున్నారు. ఆసక్తిగా పోరాటాన్ని ఆపకుండా చూస్తున్నారు.

SDM జాబ్ గురించి మీకు తెలుసా..? జీతం ఎంత వస్తుంది..! సౌకర్యాలు ఎవరు కల్పిస్తారు..

Telangana Municipalities: తెలంగాణ పురపోరులో మహిళలకే పట్టం.. కొలువుదీరిన‌ కొత్త మేయ‌ర్లు, చైర్మన్లు..