AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Clerk Notification 2025: ఎస్బీఐలో 6,589 క్లర్క్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు! ఎలా ఎంపిక చేస్తారంటే..

ఎస్బీఐలో క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం మొత్తం 6,589 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు..

SBI Clerk Notification 2025: ఎస్బీఐలో 6,589 క్లర్క్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు! ఎలా ఎంపిక చేస్తారంటే..
SBI Clerk Jobs
Srilakshmi C
|

Updated on: Aug 17, 2025 | 7:03 PM

Share

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచుల్లో క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం మొత్తం 6,589 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిల్లో 5,180 రెగ్యులర్ పోస్టులు, 1,409 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 26, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిసెంబర్ 31, 2025 నాటికి అభ్యర్ధులు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 1, 2025వ తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే ఏప్రిల్ 02, 1997 నుంచి ఏప్రిల్ 01, 2005 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిబంధనల మేరకు ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 26, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.750 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ఎస్‌, డీఎక్స్‌ఎస్‌ అభ్యర్థులకు ఎలంటి ఫీజు లేదు. ప్రిలిమినరీ, మెయిన్స్‌, స్థానిక భాష ప్రావీణ్యం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 24,050 నుంచి రూ.64,480 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఎంపిక విధానం ఇలా..

ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు వంద ప్రశ్నలకు 1 గంట సమయంలో సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్ష ఆబ్జెక్టివ్ విధాంనలో 200 మార్కులకు 200 ప్రశ్నలకు 2 గంటలు 40 నిమిషాల సమయంలో పరీక్ష ఉంటుంది. అనంతరం స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రిలిమ్స్ & మెయిన్స్‌లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్