SSB Recruitment 2023: టెన్త్/ఇంటర్ అర్హతతో.. సశస్త్ర సీమా బాల్ 944 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ).. 944 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ).. 944 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైవారు దేశ వ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించవల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమాతో లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి.. హెచ్‌సీ (మెకానిక్) పోస్టులకు 21 నుంచి 27 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు (జూన్ 18, 2023) దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్ధులకు ఎటువంటి ఫీజు ఉండదు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- హెడ్ కానిస్టేబుల్స్ (ఎలక్ట్రీషియన్) పోస్టులు: 15
- హెడ్ కానిస్టేబుల్స్ (మెకానిక్- పురుషులు) పోస్టులు: 296
- హెడ్ కానిస్టేబుల్స్ (స్టీవార్డ్) పోస్టులు: 2
- హెడ్ కానిస్టేబుల్స్ (వెటర్నరీ) పోస్టులు: 23
- హెడ్ కానిస్టేబుల్స్ (కమ్యూనికేషన్) పోస్టులు: 578
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.