Sasaram Railway: ఆ స్టేషన్ రైళ్లు ఆగే ప్రదేశం మాత్రమే కాదు.. విజ్ఞానాన్ని పెంపొందించే అడ్డా కూడా..
Sasaram Railway Station: విజయాన్ని సాధించలేని వారికి వంద కారణాలు ఉంటాయి. కానీ అనుకున్నది సాధించాలనుకునే వారికి మాత్రం కష్ట పడాలనే ధ్యేయం..
Sasaram Railway Station: విజయాన్ని సాధించలేని వారికి వంద కారణాలు ఉంటాయి. కానీ అనుకున్నది సాధించాలనుకునే వారికి మాత్రం కష్ట పడాలనే ధ్యేయం మాత్రమే ఉంటుంది. ఇలాంటి వారే తమకు లభించే చిన్న అవకాశాన్ని కూడా సదవకాశంగా వాడుకుంటారు. ఇలా కష్టపడి జీవితంలో ఎదగాలనుకునే వారికి అండగా నిలుస్తోంది బిహార్‌లోని సాసారం అనే రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం అయ్యిందంటే చాలు రైళ్లతో సంబంధం లేకుండా వందలాది మంది యువతీయువకులు భుజాన పుస్తకాల బ్యాగ్‌తో వచ్చేస్తారు. రైల్వే స్టేషన్‌కు పుస్తకాలతో రావడం ఏంటని ఆలోచిస్తున్నారా.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
బిహార్‌లోని రోహతాస్ జిల్లాలో ఉన్న సాసారం రైల్వే స్టేషన్‌లో విద్యార్థులు పెద్ద ఎత్తున చదువుకోవడానికి వస్తుంటారు. వీరిలో చాలా మంది బ్యాంకింగ్, స్టేట్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్, సివిల్ సర్వీసెస్ ఇలా రకరకాల పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. అయితే ఇక్కడ పాఠాలు చెప్పే గురువులు ఉండరు.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ, ప్రశ్నలను నివృత్తి చేసుకుంటూ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. ఇలా సాసారం చుట్టు పక్కల గ్రామల నుంచి విద్యార్థులు వస్తుండడం విశేషం.
దీనికి అసలు కారణం ఏంటంటే..
ఇత ప్రాంతాల నుంచి వచ్చి మరీ ఇక్కడే ఎందుకు చదువుకోవాలనే ప్రశ్న వస్తుంది కదూ..! దీనికి ఓ కారణం ఉంది. రోహతాస్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇప్పటికీ సరైన విద్యుత్ సదుపాయం లేదు. కరెంట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా అందుబాటులో లేదు. కానీ సాసారాం రైల్వే స్టేషన్‌లో మాత్రం 365 రోజులు కరెంట్ ఉంటుంది. దీంతో చుట్టు పక్కల గ్రామాల్లోని వారంతా ఈ రైల్వే స్టేషన్ బాట పడుతున్నారు.
నిజానికి 2002 ప్రాంతంలో పది మంది ఇక్కడ చదువుకోవడం ప్రారంభించారు. ఇంతింతై అన్నట్లు.. ఇప్పుడు ఏకంగా వందల మందికి ఈ రైల్వే స్టేషన్ చదువుకోవడానికి ఆవాసాన్ని కల్పిస్తోంది. ఈ రైల్వే స్టేషన్‌లో చదువుకున్న వారు ఎంతో మంది సివిల్, బ్యాంకులు, చివరికి రైల్వేలో కూడా ఉద్యోగాలను సంపాదించుకున్నారు. ఇలా ఎంతో మంది బంగారు భవిష్యత్తుకు కారణమవుతోన్న ఈ రైల్వే స్టేషన్ నిజంగా చరిత్రలో నిలిచి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
For two hours every morning and evening, both the platforms 1 and 2 of the railway station turn into a coaching class for young people who are aspirants for the Civil Services.
Excellent Initiative.??
Courtesy: Anuradha Prasad ILSS. pic.twitter.com/pLMkEn4AOF
— Awanish Sharan (@AwanishSharan) October 2, 2021
Also Read: Prabhas: మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేందుకు రెడీ అయిన ప్రభాస్.. ఆ తేదీన డార్లింగ్ 25వ సినిమా ప్రకటన..
Movie Releases: ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఇవే.. పూర్తి వివరాలు