Govt jobs: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 167 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు మీకోసం..!
మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ చదివే యువతకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌ల నియామకాన్ని ప్రకటించింది.
Vikram Sarabhai Space Center: ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన వారికి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఆహ్వానం పలుకుతోంది. మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ చదివే యువతకు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌ల నియామకాన్ని ప్రకటించింది. వీటి కింద వివిధ ట్రేడ్‌లలో మొత్తం 167 ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టుల కోసం అక్టోబర్ 8 చివరి తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని వీఎస్‌ఎస్‌సీ పేర్కొంది. పూర్తి వివరాలకు https://www.vssc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోడానికి కూడా పై లింక్‌ను ఉపయోగించుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం బీఈ / బీటెక్ లేదా హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలని కోరింది.
పోస్టుల సంఖ్య: ఏరోనాటికల్/ఏరోస్పేస్ -15 పోస్టులు కెమికల్ ఇంజనీరింగ్ – 10 పోస్టులు సివిల్ ఇంజనీరింగ్ – 12 పోస్టులు కంప్యూటర్ సైన్స్ – 20 పోస్టులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 12 పోస్టులు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 40 పోస్టులు మెకానికల్ ఇంజనీరింగ్ – 40 పోస్టులు మెటలర్జీ- 06 పోస్టులు ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 06 పోస్టులు ఫైర్ & సేఫ్టీ ఇంజనీరింగ్- 02 పోస్టులు హోటల్ మేనేజ్‌మెంట్/కేటరింగ్ టెక్నాలజీ- 04 పోస్టులు
అర్హతలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: సంబంధిత విభాగంలో కనీసం 65% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
హోటల్ మేనేజ్‌మెంట్/కేటరింగ్ టెక్నాలజీ: 60% మార్కులతో హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి.
వయస్సు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 30 సంవల్సరాల లోపు ఉండాలి. వయోపరిమితి ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు, పీడబ్యూడీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు అవకాశం ఉంది.
అప్లికేషన్, పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
IIM Recruitment: అమృత్‌సర్ ఐఐఎంలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.