Railway Recruitment 2021: గుడ్‌న్యూస్.. రైల్వేలో ఉద్యోగాలు.. 2,945 పోస్టులకు నోటిఫికేషన్..! పూర్తి వివరాలు
Railway Recruitment 2021: నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో భారీగా..
Railway Recruitment 2021: నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇక ఇండియన్ రైల్వేలో అయితే చాలా నోటిఫికేషన్లు వెలువడుతుంటాయి. తాజాగా భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఈస్టర్న్ రైల్వే భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2,945 ఖాళీలు ఉన్నాయి. వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, లైన్‌మెన్, వైర్‌మెన్, పెయింటర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. అప్రెంటీస్ యాక్ట్-1961, అప్రెంటీస్‌షిప్ రూల్స్-1992 ప్రకారం ఈ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈస్టర్న్ రైల్వే. ఇవి ఏడాది గడువు గల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 4న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
► దరఖాస్తు ప్రారంభం: 2021 అక్టోబర్ 4.
► దరఖాస్తుకు చివరి తేదీ: 2021 నవంబర్ 3 సాయంత్రం 6 గంటలు.
► మెరిట్ లిస్ట్ విడుదల: 2021 నవంబర్ 18.
► విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
► వయస్సు: 15 నుంచి 24 ఏళ్ల లోపు
► దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా..
► అభ్యర్థులు ముందుగా ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
► హోమ్ పేజీలో అప్రెంటీస్ నోటిఫికేషన్ ఉంటుంది.
► నోటిఫికేషన్ కింద అప్లికేషన్ లింక్ ఉంటుంది. క్లిక్ చేయాలి.
► అభ్యర్థులు పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
► అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
► దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
► దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.