Postal Recruitment Delhi: ఇండియన్‌ పోస్టల్‌ స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకు పైగా జీతం పొందే అవకాశం.

Postal Recruitment Delhi: భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ పోస్టల్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీ సర్కిల్‌ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం..

Postal Recruitment Delhi: ఇండియన్‌ పోస్టల్‌ స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకు పైగా జీతం పొందే అవకాశం.
Follow us

|

Updated on: Oct 03, 2021 | 11:04 AM

Postal Recruitment Delhi: భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ పోస్టల్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీ సర్కిల్‌ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను స్పోర్ట్స్‌ కోటా ద్వారా తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 221 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్ అసిస్టెంట్‌ (72), పోస్టుమ్యాన్‌ (90), మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (59) ఖాళీలు ఉన్నాయి.

* పోస్టల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100వరకు జీతంగా చెల్లిస్తారు.

* పోస్ట్‌ మ్యాన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవారు ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ 59,100 జీతంగా చెల్లిస్తారు.

* మల్టీ టాస్కింగ్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికై వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 జీతంగా చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఏడీ (రిక్రూట్‌మెంట్‌), సీపీఎంజీ, ఢిల్లీ సర్కిల్‌, మేఘదూత్‌ భవన్‌, న్యూఢిలీ – 110001 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు

* దరఖాస్తుల ప్రక్రియ రేపటి నుంచి (04-10-202) ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 12-10-2021గా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Scientist Posts: హైదరాబాద్‌ సీసీఎంబీలో శాస్త్రవేత్తల ఉద్యోగాలు..దరఖాస్తుకు చివరి తేదీ.. పూర్తి వివరాలు..!

IIM Recruitment: అమృత్‌సర్‌ ఐఐఎంలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

IDBI Bank AM Result 2021: అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..