AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC Exams: కరోనా ఎఫెక్ట్‌.. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ పరీక్షలు వాయిదా.. అభ్యర్థుల ఎదురు చూపు..!

RRB NTPC Exams: కరోనా మహమ్మారి చేస్తున్న పని అంతా కాదు. ఏడాది కిందట ఫస్ట్‌ వేవ్‌ విజృంభించి అదుపులోకి వస్తుందనే లోపే సెకండ్‌ వేవ్‌ తీవ్రతరమైంది. కరోనా మహమ్మారి కారణంగా..

RRB NTPC Exams: కరోనా ఎఫెక్ట్‌.. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్ డీ పరీక్షలు వాయిదా.. అభ్యర్థుల ఎదురు చూపు..!
Subhash Goud
|

Updated on: Jun 02, 2021 | 1:22 PM

Share

RRB NTPC Exams: కరోనా మహమ్మారి చేస్తున్న పని అంతా కాదు. ఏడాది కిందట ఫస్ట్‌ వేవ్‌ విజృంభించి అదుపులోకి వస్తుందనే లోపే సెకండ్‌ వేవ్‌ తీవ్రతరమైంది. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థుల పరీక్షలు, వివిధ రకాల పోటీ పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. తాజాగా భారతీయ రైల్వేలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC), గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసినవారికి అలర్ట్. ఆర్ఆర్‌బీ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది.

ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ 2019, గ్రూప్-డీ పరీక్షల తర్వాత ఫేజ్ లను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్‌ అధికంగా ఉన్న రాష్ట్రాలు ఆంక్షలు విధించాయని, దీంతో ఇప్పటికే జరగాల్సిన ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ ఆరో దశ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఆరో ఫేజ్ లో కొంతమేరకు పరీక్షలు నిర్వహించారు. మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ పోస్టుల కోసం కోటీ 25 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. లక్షకు పైగా పోస్టులు విడుదల చేయడంతో.. వివిధ దశల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. 2019లో గ్రూప్ -డీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్‌ఆర్‌బీ. అప్పటి నుంచి ఈ పరీక్ష ఇంకా జరగలేదు. పరీక్ష నిర్వహించే ఏజేన్సీ కోసం అన్వేషిస్తున్నందున ఆలస్యం అయింది. ప్రస్తుతం ఏజెన్సీ దొరికినప్పటికీ కోవిడ్-19 కారణంగా పరీక్ష ఆలస్యమవుతూ వచ్చింది. ముందుగా ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ పరీక్షను 2021 ఏప్రిల్, మే మాసాల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే తాజాగా మళ్లీ వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్టీపీసీ పరీక్ష పూర్తయిన తర్వాత గ్రూప్-డీ నిర్వహిస్తామని ఆర్ఆర్‌బీ తెలిపింది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష ఇప్పటి వరకు ఆరు దశల్లో నిర్వహించారు. చివరగా ఆరో ఫేజ్ పరీక్షను 2021 ఏప్రిల్ 8వ తేదీని నిర్వహించారు. ఏడో ఫేజ్ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. దీని కోసం 20 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

Poco M3 Pro: పోకో నుంచి విడుదల కానున్న 5జీ మొబైల్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. భారత్‌లో ఎప్పుడు విడుదలంటే..!