AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RHFL Recruitment 2022: డిగ్రీ అర్హతతో రెప్కో హోమ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

చెన్నైలోని రెప్కో హోమ్ ఫైనాన్స్.. ఒప్పంద ప్రాతిపదికన టెలికాలర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

RHFL Recruitment 2022: డిగ్రీ అర్హతతో రెప్కో హోమ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
RHFL Chennai Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Nov 16, 2022 | 6:54 AM

Share

చెన్నైలోని రెప్కో హోమ్ ఫైనాన్స్.. ఒప్పంద ప్రాతిపదికన టెలికాలర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన స్థానిక అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. హిందీ, మరాఠీ/గుజరాతీ భాషల్లో నైపుణ్యం ఉండాలి. టెలీ కాలింగ్‌, కస్టమర్‌ సర్వీస్‌ విభాగంలో పని అనుభవం ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు నవంబర్‌ 1, 2022వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 25, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవచ్చు. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్:

The Assistant General Manager (HR) Repco Home Finance Limited 3rd Floor, Alexander Square New No. 2/Old No. 34 & 35 Sardar Patel Road, Guindy Chennai- 600 032.

ఇవి కూడా చదవండి

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.