JEE Main 2023: వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌లలో జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. ఈ నెలలో విడుదలకానున్న నోటిఫికేషన్‌..

జేఈఈ మెయిన్‌-2023 వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌ నెలల్లో నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించనుంది. తొలి విడత వచ్చే జనవరి, తుది విడతను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు..

JEE Main 2023: వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌లలో జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. ఈ నెలలో విడుదలకానున్న నోటిఫికేషన్‌..
JEE Main 2023
Follow us

|

Updated on: Nov 15, 2022 | 11:42 AM

జేఈఈ మెయిన్‌-2023 వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌ నెలల్లో నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించనుంది. తొలి విడత వచ్చే జనవరి, తుది విడతను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. జేఈఈ 2023 మెయిన్‌ తొలి విడత ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఈ నెలలో ప్రారంభంకానుంది. అందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ మరో వారం లేదా పది రోజుల్లో విడుదలకానుంది. కాగా ఈ పరీక్షను రెండు విడతల్లో జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు10 లక్షల మంది హాజరవుతారు. అందులో ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందికే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అవకాశం లభిస్తుంది.

కాగా ఈ ఏడాది కూడా జేఈఈ 2022 రెండు సెషన్లలో జూన్‌ 20 నుంచి 29 వరకు తొలి దశ, జులై 21 నుంచి 30 వరకు రెండు దశల్లో పరీక్ష జరిగింది. దీనిలో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశంలో ప్రసిద్ధ ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఈఎస్టీ, ఐఐఐటీ ఇతర సంస్థల్లో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.