TS Inter Exam Fee Dates 2023: ప్రారంభమైన తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండియర్‌ పరీక్ష ఫీజు చెల్లింపులు.. చివరి తేదీ ఇదే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మర్చి-2023లో జరగనున్న ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపులు నవంబర్‌ 14వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు ఇంటర్‌ బోర్డు తెల్పింది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల..

TS Inter Exam Fee Dates 2023: ప్రారంభమైన తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్‌, సెకండియర్‌ పరీక్ష ఫీజు చెల్లింపులు.. చివరి తేదీ ఇదే..
Telangana Inter Board
Follow us

|

Updated on: Nov 15, 2022 | 8:42 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మర్చి-2023లో జరగనున్న ఇంటర్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపులు నవంబర్‌ 14వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు ఇంటర్‌ బోర్డు తెల్పింది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. ఈ ఏడాది ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్ధులతో పాటు, ఫెయిల్‌ అయిన విద్యార్ధులు (జనరల్‌, ఒకేషన్‌ స్ట్రీమ్స్‌) కూడా నవంబర్‌ 30వ తేదీ వరకు ఎటువంటి జరిమానా లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు.

ఫీజుల వివరాలు ఇవే..

  • ఫస్ట్‌ ఇయర్‌ జనరల్ కోర్సులకు రూ.500లు, ఒకేషన్‌ కోర్సులకు రూ.710లు చెల్లించవచ్చు.
  • సెకండియర్‌ జనరల్ కోర్సులకు రూ.500లు, ఒకేషన్‌ కోర్సులకు రూ.710లు చెల్లించవచ్చు.
  • రూ.100ల ఆలస్య రుసుముతో (లేట్‌ ఫీ) డిసెంబర్‌ 2 నుంచి 6వ తేదీ వరకు చెల్లించవచ్చు.
  • రూ.500ల ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 12వ తేదీ వరకు చెల్లించవచ్చు.
  • రూ.1000ల ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 14 నుంచి 17 వరకు చెల్లించవచ్చు.
  • రూ.2000ల ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చు.
  • హాజరు మినహాయింపుతో పరీక్షలకు హాజరయ్యే ప్రైవేట్ విద్యార్ధులు (ఆర్ట్స్/హ్యుమానిటీస్)రూ.500ల ఫీజుతో
  • నవంబర్ 30వ తేదీలోపు చెల్లించవచ్చు. రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12వరకు చెల్లించవ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.