TS Eamcet 2023: తెలంగాణ ఎంసెట్‌లో ‘ఇంటర్‌’ వెయిటేజీ శాశ్వతంగా రద్దు?

తెలంగాణ ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీని శాశ్వతంగా ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాదితోపాటు గత రెండేళ్లుగా 25 శాతం ఇంటర్ వెయిటేజీని పక్కన పెట్టారు. దీంతో ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకు కేటాస్తూ వస్తున్నారు. ఇక మునుముందు..

TS Eamcet 2023: తెలంగాణ ఎంసెట్‌లో ‘ఇంటర్‌’ వెయిటేజీ శాశ్వతంగా రద్దు?
Inter weightage marks in Eamcet
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 15, 2022 | 9:21 AM

తెలంగాణ ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీని శాశ్వతంగా ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాదితోపాటు గత రెండేళ్లుగా 25 శాతం ఇంటర్ వెయిటేజీని పక్కన పెట్టారు. దీంతో ఎంసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకు కేటాస్తూ వస్తున్నారు. ఇక మునుముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జేఈఈ మెయిన్‌, నీట్‌ తదితర పలు ప్రవేశ పరీక్షల్లో కూడా ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేదు. ఎంసెట్‌లోనూ తొలగించడమే మంచిదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలో వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించే ఎంసెట్‌లోనైనా ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉంటుందా? లేదా ? అనే విషయంపై విద్యాశాఖ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

అంతేకాకుండా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్ధులు ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీల్లో చదివే విద్యార్ధులతోపోటీ పడాలంటే ఇంటర్‌ సెకండియర్‌ నుంచే విద్యార్ధులను సన్నద్ధత చేయవల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోందని, అటు ఇంటర్‌, ఇటు ఎంసెట్‌పై దృష్టి పెట్టాల్సి వస్తోందని, వెయిటేజీ ఉండకపోవడమే మంచిదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి విద్యాశాఖతో చర్చించాలని భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గత మూడేళ్లుగా ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేకున్నా ఎంసెట్‌లో సున్నా వచ్చిన ఎస్‌సీ, ఎస్‌టీల విద్యార్థులు లేరని, ర్యాంకు కేటాయింపుపై ఎటువంటి సమస్య తలెత్తదని కూడా ఉన్నత విద్యామండలి వర్గాలు తెల్పుతున్నాయి. పైగా గత మూడేళ్లుగా వెయిటేజీ లేకపోవడంతో ఎంసెట్‌ ఫలితాలు సజావుగానే వెలువడుతున్నాయని, అందుకే ఇకపై వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.