BEL Recruitment 2022: బీఈ/బీటెక్ నిరుద్యోగులకు బంపరాఫర్! భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధత స్పెషలైజేషన్‌లో ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్ 1, 2022వ తేదీ నాటికి 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 24, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవచ్చు. ఐతే దరఖాస్తు సమయలో జనరల్ అభ్యర్ధులు రూ.400 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి కింది విధంగా జీత భత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
జీతభత్యాల వివరాలు..
- మొదటి ఏడాది నెలకు రూ.40,000లు,
- రెండో ఏడాది నెలకు రూ.45,000లు,
- మూడో ఏడాది నెలకు రూ.50,000లు,
- నాలుడో ఏడాది నెలకు రూ.55,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
అడ్రస్:
Sr. Dy. General Manager (HR), Naval Systems SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore – 560013, Karnataka.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.