TSSPDCL JLM Jobs: తెలంగాణ విద్యుత్‌ శాఖలో రద్దైన ఆ పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్‌..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సదరన్‌ పవర్‌ డిస్టిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ 1000 జూనియర్‌ లైన్‌ మెన్‌ పోస్టుల భర్తీ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకోవడంతో రద్దైన నోటిఫికేషన్ కు సంబంధించి కొత్త ప్రకటన..

TSSPDCL JLM Jobs: తెలంగాణ విద్యుత్‌ శాఖలో రద్దైన ఆ పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్‌..
TSSPDCL JLM Recruitment 2022
Follow us

|

Updated on: Nov 15, 2022 | 1:04 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సదరన్‌ పవర్‌ డిస్టిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ 1000 జూనియర్‌ లైన్‌ మెన్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌కు జులై 17న రాత పరీక్ష నిర్వహించారు. ఐతే ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధుల్లో కొంతమంది వద్ద నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు డబ్బులు వసూలు చేసి మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన రాచకొండ పోలీస్‌ బృందం.. 181 మందికి ఐదుగురు ఉద్యోగులు సమాధానాలు చేరవేసినట్లు రుజువైంది. ఈ రాత పరీక్షలో విద్యుత్ సంస్థలకు చెందిన ఈ ఐదుగురు ఉద్యోగులపై వేటు పడింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో పని చేస్తున్న మలక్ పెట్ ఏడీఈ మొహమ్మెద్ ఫిరోజ్ ఖాన్, విద్యా నగర్ లైన్ మెన్‌ను సపావత్ శ్రీనివాస్‌, రెతిబౌలి సెక్షన్లో ప్రైవేట్ మీటర్ రీడర్‌గా పని చేస్తున్న శ్రీ కేతావత్, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో పని చేస్తున్న జగిత్యాల సబ్ ఇంజినీర్ షేక్ సాజన్, తెలంగాణ ట్రాన్స్ కో లో పని చేస్తున్న మిర్యాలగూడ ఏడిఈ మంగళగిరి సైదులుగా గుర్తించారు. ఈ ఐదుగురిపై విద్యుత్ శాఖ క్రిమినల్ కేసులు పెట్టడంతోపాటు, విధుల నుంచి సస్పెండ్ చేసింది.

రాత పరీక్షలో జరిగిన అక్రమాలపై ఉద్యోగార్ధులు కార్పొరేట్ కార్యాలయం వద్ద నిరసనలు తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులుగా తేలిన విద్యుత్ సంస్థల ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేశారు కూడా. జూనియర్ లైన్‌మెన్‌ పరీక్షలో అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో మే 5వ తేదీన నోటిఫికేషన్ నెంబర్ 03 /2022ను రద్దు చేస్తున్నట్లు విద్యుత్‌ శాఖ ప్రకటించింది. ఈ 1000 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం త్వరలో మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని అప్పట్లో సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి తెలిపారు.

కాగా ఇప్పటికే సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయడంతో, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసినట్లైంది. దీంతో గతంలో రద్దు చేసిన జూనియర్‌ లైన్‌మెన్‌ నోటిఫికేషన్‌ జారీ పై సంస్థ యాజమాన్యం కసరత్తు ప్రారంభించనుందని సమాచారం. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి