AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Layoffs: ట్విటర్, ఫేస్‌బుక్‌ బాటలో అమెజాన్‌! దాదాపు 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్‌ కూడా ట్విటర్, ఫేస్‌బుక్‌ పేరెంట్ మెటా బాటలో నడుస్తన్నట్లు తెలుస్తోది. కంపెనీ వర్క్‌ ఫోర్స్‌లో దాదాపు 10 వేల మంది ఉద్యోగులపై వేటువేయనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా..

Amazon Layoffs: ట్విటర్, ఫేస్‌బుక్‌ బాటలో అమెజాన్‌! దాదాపు 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన..
Amazon Plans To Lay Employees
Srilakshmi C
|

Updated on: Nov 15, 2022 | 1:58 PM

Share

ప్రముఖ దిగ్గజ సంస్థ అమెజాన్‌ కూడా ట్విటర్, ఫేస్‌బుక్‌ పేరెంట్ మెటా బాటలో నడుస్తన్నట్లు తెలుస్తోది. కంపెనీ వర్క్‌ ఫోర్స్‌లో దాదాపు 10 వేల మంది ఉద్యోగులపై వేటువేయనున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచుల్లో కార్పొరేట్‌, టెక్నాలజీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఈ వారం నుంచే ప్రారంభిస్తున్నట్లు న్యూయర్క్‌ టైమ్స్‌ కధనాలు వెల్లడించాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొత్త నియామకాలు సైతం నిలిపివేస్తున్నట్లు తెల్పింది. అమెజాన్‌ డివైజెస్‌ ఆర్గనైజేషన్‌, వైస్‌ అసిస్టెంట్‌ అనెగ్జా, రిటైల్‌, హ్యూమన్‌ రీసోర్సెస్‌ విభాగాల్లో ప్రస్తుతానికి కోతలు విధించనున్నట్లు సమచారం. దీంతో అమెజాన్‌ ఎంప్లయిస్‌లో దాదాపు 3 శాతం మందిని తొలగించే అవకాశం ఉంది.

ప్రస్తుతం నష్టాలు అంతకంత పెరుగుతుండటంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు అమెజాన్ తన హెడ్‌కౌంట్‌ను దాదాపు 80,000 మందికి తగ్గించినట్లు న్యూయర్క్‌ టైమ్స్‌ పేర్కొంది. భారీగా పెరుగుతున్న అట్రిషన్ రేటు, సెప్టెంబరులో అనేక చిన్న టీమ్‌లలో నియామకాలను స్తంభింపజేయడం, కార్పొరేట్ నియామకాల నిలిపివేత, అధిక వ్యయాలు, ద్రవ్యోల్బణం, విస్తరణ కోసం అధిక పెట్టుబడి.. వంటివి కంపెనీ నష్టాలకు దారి తీసిన కారణాల్లో ప్రధానమైనవి. ఇక కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రపంచ మార్కెట్‌పై కోలుకోలేని దెబ్బపడింది. గత రెండేళ్లలో లాక్‌డౌన్ల వల్ల ఆన్‌లైన్ షాపింగ్‌ ప్లాట్‌ఫాంలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయ్‌. దీంతో పోటీ నెలకొంది. ఈ పోటీలో అమెజాన్‌ నష్టాలు చవిచూడవల్సి వచ్చింది. దీంతో లాభదాయకత లేని విభాగాల్లోని ఉద్యోగుల తొలగింపుకు తెర దించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.