TS Gurukul Admissions: గురుకుల ప్రవేశాల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యాసంవత్సారానికి సంబంధించి ప్రవేశాల్లో దళారులను అడ్డుకునేందుకు సొసైటీలు కొత్త విధానం అమల్లోకి..

TS Gurukul Admissions: గురుకుల ప్రవేశాల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
Gurukula Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 18, 2023 | 1:12 PM

హైదరాబాద్‌, జులై 18: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యాసంవత్సారానికి సంబంధించి ప్రవేశాల్లో దళారులను అడ్డుకునేందుకు సొసైటీలు కొత్త విధానం అమల్లోకి తీసుకువచ్చాయి. 5వ, 6వ, 7వ, 8వ తరగతుల్లో కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించేలా కొత్త కార్యచరణను రూపొందించింది. ఈ విధానం ద్వారా విద్యార్థుల ప్రతిభ, సామాజిక పరిస్థితులు పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తామని మభ్య పెట్టేవారిపై కఠిన చర్యలకు పూనుకుంటోంది. మిగిలిన సీట్లకు ప్రతిభ ఆధారంగా విద్యార్ధులకు ఫోన్‌ చేసి లేదా ఎస్‌ఎంఎస్‌లు పంపించి ప్రవేశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కాగా గురుకులాల్లో అయిదో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్‌, డిగ్రీ వరకు చదువుకునేందుకు అవకాశం ఉన్నందున ఈ సీట్లకు డిమాండ్‌ బాగానే ఉంది. విద్య, వసతి ఉండడంతో సీట్లకు పోటీపడుతున్నారు. గురుకులాల్లో ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో అయిదో తరగతి, ఇంటర్‌, డిగ్రీతో పాటు బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి కౌన్సెలింగ్‌ జరుగుతోంది. కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిపోయిన సీట్లను ఈ మేరకు భర్తీ చేయనున్నట్లు గురుకుల సొసైటీ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.