Power Grid Recruitment: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఎప్పుడంటే.

Power Grid Recruitment: భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం...

Power Grid Recruitment: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఎప్పుడంటే.
Power Grid
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 22, 2021 | 10:29 AM

Power Grid Recruitment: భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 137 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఈ నెల 27తో ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 137 ఖాళీలకు గాను ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)–48, ఫీల్డ్‌ ఇంజనీర్‌(సివిల్‌)–17, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌)–50, ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(సివిల్‌)–22 పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌)/బీఈ(పవర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. * ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం తప్పనిసరి. * అభ్యర్థుల వయసు 27.08.2021 నాటికి 29ఏళ్లు మించకుండా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఫీల్డ్‌ ఇంజనీర్లకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000, ఫీల్డ్‌ సూపర్‌వైజర్లకు నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000లతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. * అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్ట్‌(టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్, అప్టిట్యూడ్‌ టెస్ట్‌), పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. * చివరగా ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 27-08-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Job Mela: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌. గుంటూరులో ఆగస్టు 25న జాబ్‌మేళా.. పాల్గొననున్న 6 కంపెనీలు. పూర్తి వివరాలు..

BECIL Recruitment: బీఈసీఐఎల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణకు రేపే చివరి తేదీ.

BOI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..! దరఖాస్తు చేసుకోండిలా