NIHFW Recruitment 2022: పదో తరగతి అర్హతతో నెలకు రూ.2 లక్షల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (NIHFW).. 13 మెడికల్ ఆఫీసర్, సీనియర్ డాక్యుమెంటేషన్ ఆఫీసర్ తదితర..

NIHFW New Delhi Medical Officer Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (NIHFW).. 13 మెడికల్ ఆఫీసర్, సీనియర్ డాక్యుమెంటేషన్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ తదితర (Medical Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి పదో తరగతి, డిప్లొమా, ఎంబీబీఎస్, బీఈ/బీటెక్, పీజీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 25 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెప్టెంబర్ 30, 2022వ తేదిలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎంపిక విధానం, అనుభవం వంటి ఇతర వివరాలు తెలుసుకోవచ్చు. ఎంపికైనవారికి నెలకు రూ.35,400ల నుంచి రూ.2,08,700 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- మెడికల్ ఆఫీసర్ (మేల్) పోస్టులు: 1
- సీనియర్ డాక్యుమెంటేషన్ ఆఫీసర్ పోస్టులు: 1
- అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు: 2
- ప్రోగ్రామర్ పోస్టులు: 2
- అకౌంటెంట్ పోస్టులు: 5
- ట్రాన్స్‌పోర్ట్ సూపర్‌వైజర్ పోస్టులు: 1
- సీనియర్ ఆర్టిస్ట్ పోస్టులు: 1
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.




మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.




