SAI Recruitment 2022: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటల్లో..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI) వివిధ నేషనల్ సెంటర్స్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రిసెర్చ్‌ కేంద్రాల్లో ఒప్పంద..

SAI Recruitment 2022: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటల్లో..
Sai New Delhi
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 05, 2022 | 7:07 AM

Sports Authority of India Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ (Ministry of Youth Affairs and Sports)కు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI) వివిధ నేషనల్ సెంటర్స్ ఫర్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ రిసెర్చ్‌ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన138 హై పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరితేదీ. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 5, 2022 తుది సమయం ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణులైనవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,05,000ల చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 42
  • స్ట్రెంథ్‌ అండ్‌ కండిషనింగ్ ఎక్స్‌పర్ట్ పోస్టులు: 42
  • ఫిజియాలజిస్ట్ పోస్టులు: 13
  • సైకాలజిస్ట్ పోస్టులు: 13
  • బయోమెకానిక్స్ పోస్టులు: 13
  • న్యూట్రీషనిస్ట్ పోస్టులు: 13
  • బయోకెమిస్ట్ పోస్టులు: 2

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.