AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj Second Marriage: మళ్లీ పెళ్లికి రెడీ అయిన హీరో మంచు మనోజ్.. రెండో భార్యగా రాబోతోంది ఎవరో కాదు..

2019లో భార్య ప్రణతితో విడాకులు తీసుకున్న తర్వాత గడచిన మూడేళ్ల నుంచి సింగిల్ స్టేటస్ మెయిన్‌టేన్ చేస్తున్న మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడు. రెండో భార్యగా రాబోతుంది ఎవరో కాదు..

Manchu Manoj Second Marriage: మళ్లీ పెళ్లికి రెడీ అయిన హీరో మంచు మనోజ్.. రెండో భార్యగా రాబోతోంది ఎవరో కాదు..
Manchu Manoj
Srilakshmi C
|

Updated on: Sep 04, 2022 | 9:39 PM

Share

Hero Manchu Manoj second marriage News: తెలుగు ప్రేక్షకులకు పరిచయంలేని పేరు మంచు మనోజ్. భార్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి అడపాదడపా మంచు మనోజ్ రెండో పెళ్లిపై నెట్టింట పుకార్లు షాకార్లు చేశాయ్‌. ఈ వార్తల్నింటికి తెర దించుతూ మంచు మనోజ్‌ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే.. భూమా నాగిరెడ్డి రెండవ కూతురు భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ రోజు హింట్ ఇచ్చాడు. గత మూడేళ్ల నుంచి సింగిల్ స్టేటస్ మెయిన్‌ టేన్ చేస్తున్న మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ బంధంతో చిత్రసంబంధం.. రాజకీయ బంధం చిత్రసంబంధం ముడిపడింది. మంచు మనోజ్‌తో కలిసి తళుక్కునమెరిసింది భూమా మౌనికారెడ్డి. హైదరాబాద్‌లోని ఓ గణేశ్‌ మండపం దగ్గర వీరిద్దరూ హల్‌చల్‌ చేశారు. దీంతో భూమా మౌనికా రెడ్డి, మంచు మనోజ్‌లు పెళ్ళి చేసుకుబోతున్నట్టు తేటతెల్లం అయ్యింది? ఇదే బ్రేకింగ్‌ న్యూస్‌ ఇప్పుడు ఇటు సినీ ఇండస్ట్రీలో, అటు పొలిటికల్‌ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్‌, భూమా మౌనికా రెడ్డిలు పెళ్ళి బాజాలు మోగేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లో వినాయకుడి మండపం దగ్గర హఠాత్తుగా ప్రత్యక్షమై, ఈ యువజంట హల్‌చల్‌ చేసింది. దివంగత భూమా నాగిరెడ్డి దంపతుల రెండవ కుమార్తె మౌనిక, మంచు విష్ణుతో కలిసి సీతాఫల్‌ మండిలో వినాయకుడిని దర్శించుకోవడం సర్వత్రా హాట్‌ టాపిక్‌గా మారింది. లేటెస్ట్‌గా వీరిద్దరి వీడియో తెలుగురాష్ట్రాల్లో సరికొత్త న్యూస్‌ని క్రియేట్‌ చేసింది. దీంతో ఇప్పుడు ఇటు చిత్రపరిశ్రమలోనూ, అటు రాజకీయరంగంలోనూ సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది.

ఇక భూమా నాగిరెడ్డి దంపతుల మరణానంతరం అక్క అఖిలకు చేదోడు వాదోడుగా మారింది భూమా మౌనికా రెడ్డి. భూ బెదిరింపుల కేసులో కిడ్నాప్‌ వ్యవహారంతో అక్క అఖిలప్రియ జైలుకెళ్ళాక నియోజకవర్గంలో మౌనిక కీలకంగా మారింది. అటు భార్య ప్రణతితో 2019లోనే విడాకులు తీసుకున్న మంచు మనోజ్‌, అనంతరం స్వయంగా సొంత నిర్మాణ సంస్థను స్థాపించాడు. గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకూ, మీడియాకూ దూరంగా ఉన్న మనోజ్‌, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ‘అహం బ్రహ్మస్మి’ సినిమాలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇద్దరికీ ఇది రెండో పెళ్లే.. ఇటు మంచు మనోజ్‌కీ, అటు భూమా మౌనికా రెడ్డికీ గతంలో వేర్వేరుగా వివాహాలు జరిగాయి. అయితే వారి జీవిత భాగస్వాముల దగ్గర నుంచి ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ ఇద్దరూ ఒంటరిగా ఉంటున్నారు. ఇక ఈ రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. ఈ రెండు కుటుంబాలూ టీడీపీ పునాదులున్నవే. అదే స్నేహం వీరిని ఒక్కటి చేసిందా? అవుననే అంటున్నాయి గతకాలపు అనుభవాలు. ఎప్పటి నుంచో ఈ రెండు కుటుంబాలకీ మధ్య స్నేహబంధం ఉంది. భూమా దంపతుల మరణానంతరం వీరి బంధం మరింత బలపడింది. తరచూ మంచు మనోజ్‌ భూమా కుటుంబంలోని కీలక సందర్భాల్లో కనిపిస్తూ ఉండేవారు. వీరి మధ్య బంధం బలమైనదన్న విషయం అనేక సందర్భాల్లో వ్యక్తం అయ్యింది. ఇప్పుడు అది శాశ్వత బంధంగా మారబోతోంది. అంతే కాదు. మంచు మనోజ్‌ ఈ కుటుంబం కష్ట సుఖాల్ని పంచుకున్నాడు. ఆపదలో ఉన్న ప్రతిసారీ మంచు ప్రసెన్స్‌ భూమా ఇంట కచ్చితంగా ఉండేది. బహుశా వీరిద్దరి మధ్యా ప్రేమచిగురించడానికి ఇదే కారణమై ఉంటుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఇప్పుడు లేటెస్ట్‌ దృశ్యాలు మంచు మనోజ్‌, భూమా మౌనికారెడ్డిల వివాహాన్ని ఖరారు చేశాయి. అయితే వీరిద్దరూ పెళ్ళయి, తమ సహచరులతో విడాకులు తీసుకున్నవారు. ఇక ఈ తాజా పెళ్ళివీరిద్దరి వ్యక్తిగత విషయం. సందర్భమొచ్చినప్పుడు తామే చెపుతామని మంచు మనోజ్‌ మీడియాకు చెప్పారు. ఇక మంచువారి ఇంట పెళ్ళి సందడి ఎప్పుడో ఎదురుచూడాల్సిందే..!