- Telugu News Photo Gallery Mushrooms Side Effects in Telugu: These are some Serious Side Effects That You Probably Didn't Know
Mushrooms Side Effects: పుట్టగొడుగులు ఎక్కువగా తింటున్నారా? ఐతే మీకు ఈ తంటాలు తప్పవు..
పుట్టగొడుగులంటే ఇష్టపడని వారుండరు. వీటిల్లో విటమిన్ డి, బి, పొటాషియం, కాపర్, సెలీనియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐతే ఇష్టం కదా అని మరీ ఎక్కువగా..
Updated on: Sep 04, 2022 | 5:14 PM

పుట్టగొడుగులంటే ఇష్టపడని వారుండరు. వీటిల్లో విటమిన్ డి, బి, పొటాషియం, కాపర్, సెలీనియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐతే ఇష్టం కదా అని మరీ ఎక్కువగా తింటే ఆరోగ్యంపై దుష్ర్ఫభావం చూపుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..

పుట్టగొడుగులను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. విరేచనాలు, వికారం, వాంతులు కూడా అవుతాయి. కాబట్టి వీటిపి ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.

పుట్టగొడుగులను అధికంగా తీసుకోవడం వల్ల చర్మానికి సంబంధించిన అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చర్మంపై దద్దుర్లు వస్తాయి.

వీటిని ఎక్కువగా తింటే అలసట, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. అసౌకర్యంగా అనిపించడంతోపాటు జీర్ణశక్తి కూడా సన్నగిల్లుతుంది.

పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్తో మరొకటి తలనొప్పి. కాబట్టి వీటిని ఎక్కువగా తినకుండా పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలనే విషయం మర్చిపోకూడదు.




