NIFTEE 2025 Exam Date: ఎన్‌ఐఎఫ్‌టీఈఈ-2025 ప్రవేశ పరీక్ష తేదీ విడుదల.. ఎప్పట్నుంచంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టీఈఈ-2025) స్టేజ్ 2 ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన తేదీలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. తాజా షెడ్యూల్ ప్రకారం..

హైదరాబాద్, మే 18: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టీఈఈ-2025) స్టేజ్ 2 ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన తేదీలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఎన్‌ఐఎఫ్‌టీఈఈ-2025 స్టేజ్ 1 పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్ 24న విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం స్టేజ్ 2 పరీక్షలను జూన్ 8న నిర్వహించనుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా యూజీ, పీజీకి సంబంధించి వివిధ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎన్‌ఐఎఫ్‌టీఈఈ-2025 షెడ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తితిదే వేద పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తితిదే వేద పాఠశాలల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన వారు మే 30లోగా దరఖాస్తు చేసుకోవాలని తితిదే సూచించింది. తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర, తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాలు.. కీసరగుట్ట, విజయనగరం, ఐ.భీమవరం, నల్గొండ, కోటప్పకొండలోని పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యా ప్రమాణాలు కలిగిన వారు ఎవరైనా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. www.tirumala.org
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








